The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
'సంపూర్ణ రామాయణం' తెలుగు చలన భక్తి చిత్రం 1972 మార్చి 16 న విడుదల.రామాయణ కావ్యాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు బాపు(సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ ) సిద్ధహస్తుడు . వారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, చంద్రకళ, ఎస్ వి రంగారావు, చంద్రమోహన్, ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ అందించారు.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నగ్నత్వం అనేది ఒక వ్యక్తి దుస్తులు ధరించని లేదా ప్రత్యేకంగా అతని లేదా ఆమె జననాంగాలను కవర్ చేయని పరిస్థితి. వివిధ సంస్కృతులు, మతాల ప్రభావంతో మానవ సమాజాలలో నగ్నత్వం ప్రబలంగా ఉంది. బట్టలు ధరించడం అనేది మానవ క్రియాత్మక అవసరాల నుండి ఉత్పన్నమయ్యే ప్రముఖ లక్షణాలలో ఒకటి, వస్తువుల నుండి రక్షణ, జుట్టు కోల్పోయిన తరువాత, చల్లటి ప్రాంతాలకు వలస వచ్చిన తరువాత చల్లగా ఉంటుంది.
కోడలు దిద్దిన కాపురం (1970 సినిమా)
కోడలు దిద్దిన కాపురం ,21, అక్టోబర్ ,1970 న విడుదలైన ఉత్తమ విలువలు ఉన్న చిత్రం.ఈ చిత్రాన్ని ఎన్ టి ఆర్ ఎస్టేట్స్ బ్యానర్ పై త్రివిక్రమ రావు నిర్మించిన, ఎన్టీఆర్ 200 వ చిత్రం.నందమూరి తారక రామారావు , సావిత్రి, జగ్గయ్య, వాణీశ్రీ , మున్నగు వారు నటించిన ఈ చిత్రాన్ని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తమ నంది అవార్డుకు ఎంపిక చేయబడింది.ఈ చిత్రానికి దర్శకత్వం డీ.యోగానంద్ కాగా , సంగీతం టీ వీ రాజు అందించారు.
మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.
సేషెల్స్ ), అధికారికంగా " సేషెల్స్ రిపబ్లిక్ " హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపసమూహ దేశం. 115 ద్వీపాల దేశం రాజధాని విక్టోరియా, తూర్పు ఆఫ్రికాకు తూర్పున 1,500 కిలోమీటర్ల (932 మైళ్ళు) దూరంలో ఉంది. ఇతర సమీపంలోని ద్వీప దేశాలు, భూభాగాలు కొమొరోస్, మయొట్టె (ఫ్రాన్స్ ప్రాంతం), మడగాస్కర్, రీయూనియన్ (ఫ్రాన్సు ప్రాంతం), దక్షిణసరిహద్దులో మారిషస్, అలాగే తూర్పు సరిహద్దులో మాల్దీవులు, బ్రిటీషు హిందూ మహాసముద్రం ఉన్నాయి.
నీరా ఆర్య 1902 మార్చి 5న ఉత్తర ప్రదేశ్ లోని ఖేక్రా నగర్ లో వ్యాపారవేత్త సేథ్ ఛజుమాల్ కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి నుండి నిజమైన జాతీయవాది, స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో భాగం కావాలనే దార్శనికత ఎల్లప్పుడూ ఉండేది. కలకత్తాలో తండ్రి వ్యాపారం చక్కగా సాగడంతో ( అతని వ్యాపారం దేశవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ కలకత్తా అతని వ్యాపారానికి కేంద్రంగా ఉంది) కారణంతో కలకత్తాలో ఆమె చదువు కొనసాగింది.
సమంత (జననం 1987 ఏప్రిల్ 28), తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం (2010), దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.
నియోగం అనేది హిందూ సంప్రదాయంలో, ముఖ్యంగా ప్రాచీన కాలంలో భారత ఉపఖండంలో అనుసరించబడిన ఒక ఆచారం. ఈ నియోగ విధానం ప్రకారం, భర్త ద్వారా సంతానం లేని విధవలు లేదా భార్యలు మరో పురుషునితో సంతానోత్పత్తి చేయడానికి అనుమతించబడేవారు. నియోగం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కుటుంబ వంశ పరంపర కొనసాగింపును నిర్ధారించడం, అలాగే సంతానం లేని విధవ సమాజంలో ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక అస్థిరతలను తగ్గించడం.
వెన్నెల్లో ఆడపిల్ల (1987 సినిమా)
వెన్నెల్లో ఆడపిల్ల 1987లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి రేలంగి మల్లిక్ దర్శకత్వం వహించగా వెన్నెలక్రియేషన్స్.రేలంగి అచ్యుతరామరావు, పంతం నానాజీ నిర్మించారు.
పీర్ల పండుగ అనేది కర్బలా యుద్ధాన్ని స్మరించుకునే ఉత్సవంగా, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల్లో ముస్లింలచే జరుపబడే సంతాప పర్వదినం. ఈ పండుగ అషుర్ఖానాలుగా పిలువబడే సూఫీ పుణ్యక్షేత్రాల్లో సంతాప కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుతుంది. మొహర్రం సందర్భంలో, ఆలంలు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ పండుగలో ముఖ్య ఘట్టంగా ఉంటుంది.ఊరేగింపులో విభిన్న కుటుంబాలు, వ్యక్తులు విరాళంగా ఇచ్చిన అనేక ఆలంలు భాగస్వామ్యం అవుతాయి.ఉదాహరణకు, తెలంగాణలోని నరసర్లపల్లె వంటి కొన్ని గ్రామాల్లో, ఒకే కుటుంబం తరతరాలుగా ఆలంలను విరాళంగా అందిస్తున్న దాఖలాలు ఉన్నాయి.
మన్సా మూసా I (c. 1280—c. 1337) పశ్చిమ ఆఫ్రికాలోని అత్యంత సంపన్నమైన మాలి రాజ్యాన్ని పరిపాలించిన పదవ మన్సా. మూసా పట్టాభిషిక్తుడు అయ్యేనాటికి మాలి సామ్రాజ్యం అంతకుముందు ఘనా సామ్రాజ్యంలోని, ప్రస్తుత దక్షిణ మౌరిటానియలో భాగమైన ప్రాంతాలు, దాని చుట్టుపక్కల ప్రదేశాలు కూడి ఉండేది. "మెల్లె యొక్క ఎమిర్", "వంగారా గనుల ప్రభువు", "ఘనాటా ప్రాంత విజేత" వంటి అనేక బిరుదులు కలిగివుండేవాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
హైదరాబాదులోని గ్రంథాలయాల జాబితా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముఖ్య గ్రంథాలయాల జాబితా కింద ఇవ్వబడింది.
"అమెరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు అమెరికా (అయోమయ నివృత్తి) చూడండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (English: United States of America యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA యు.ఎస్.ఏ), సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము.
అనగనగా ఒకరాజు 2026లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిరించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించాడు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేసి, సినిమాను జనవరి 14న విడుదల చేశారు.
గరిక, ఒక చిన్న గడ్డి మొక్క .దీని వృక్షశాస్త్ర నామం సైనోడాన్ డాక్టిలాన్ (కుటుంబం: Poaceae) చెందింది అన్ని గడ్డి సైనోడాన్ లేదా గరిక కాదు. ఇది దర్భ/ ఇంపీరిటా లేదా కొన్ని సార్లు టైఫా ద్వారా భర్తీ చేయబడుతుంది.అవి తేలికపాటి అలర్జీని కలిగిస్తాయి.దీనిని సంస్కృతంలో దూర్వ అని పిలుస్తారు. గరిక పోచలు ఆకుపచ్చని రంగులో పొట్టిగా ఉండి 2-15 సెం.మీ.
మనుచరిత్ర, మనుచరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
గుల్షన్ దేవయ్య భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 2010లో 'దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి షైతాన్, హేట్ స్టోరీ, హంటర్ సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని షైతాన్‌లో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకొని ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందాడు.
ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ప్రత్యగాత్మ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం 1969, జూన్ 6వ తేదీన విడుదలయ్యింది.అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత , జంటగా నటించిన ఈ చిత్రం లో చిత్తూరు నాగయ్య, గుమ్మడి , అంజలీ దేవి,నాగభూషణం, ఎస్ వరలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, భారత ప్రభుత్వం చే ఈచిత్రం ఎంపిక కాబడింది. ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
దాదాపు 300 సంవత్సరాల క్రితం ఇస్లాం మత ప్రచారం కోసం సౌదీ నుంచి, మక్కా షరీఫ్ నుంచి 12 మంది తరఖ్‌మాన్ల్ అనబడే వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటకలో హైదర్అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది. వారు దేశంలో పర్యటిస్తున్నప్పుడు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి, ఇస్లామేతరులకు, మధ్య యుద్ధం జరిగింది.