The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మానవ్ జగదుసకుమార్ సుతార్ (జననం 3 ఆగస్టు 2002) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో రాజస్థాన్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఆయన 2022 ఫిబ్రవరి 17న 2021–22 రంజీ ట్రోఫీలో ఆంధ్రపై తన ఫస్ట్-క్లాస్, 2022–23 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 2022 అక్టోబర్ 11న మధ్యప్రదేశ్‌పై తన టీ20 అరంగేట్రం చేశాడు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శ్రీ భూ సమేత దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం, అమరావతి
శ్రీ భూ సమేత దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా సువిశాల మైదానంలో సుందరంగా, రమణీయంగా నిర్మితమైన ఆలయం. ఈ ఆలయంలో శ్రీ దశావతార వేంకటశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిలోనే దశావతారాలను వీక్షించే మంగళస్వరూపంగా కొలువై ఉన్నాడు. ప్రపంచంలో మరెక్కడా మనకు ఇలాంటి మంగళ స్వరూపం కనిపించదు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
షణ్ముఖి ఆంజనేయ రాజు, ప్రసిద్ధ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త. గాన గంధర్వులుగా ప్రసిద్ధులైన షణ్ముఖి ఆంజనేయరాజు తెలుగు నాటక రంగంలో చిరస్మరణీయులు.వారి శ్రీకృష్ణ,శ్రీరామ పాత్రలు తెలుగు పౌరాణిక నాటక రంగాన్ని సుసంపన్నం చేశాయి.నటుడిగా, గాయకుడిగా,సంగీత విద్వాంసుడిగా,నాటక సంస్థ నిర్వాహకుడిగా,ఆయన స్థానం అద్వితీయమైనది.ధనసంపాదన కన్నా,ప్రేక్షకుల సంతృప్తి కే ప్రాధాన్యత నిచ్చిన అసలైన కళాకారుడు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సాయి సుదర్శన్ (జననం 15 అక్టోబరు 2001) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 2019/20లో రాజా పాలయంపట్టి షీల్డ్‌లో 52.92 సగటుతో 635 పరుగులతో ఆళ్వార్‌పేట సీసీ అత్యధిక పరుగుల స్కోరర్ నిలిచాడు. 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు తరఫున 2021 నవంబర్ 4న టీ20 అరంగేట్రం చేశాడు.
దివ్యేందు శర్మ (జననం 1983 జూన్ 19), హిందీ సినిమా, సిరీస్‌లలో పనిచేసే భారతీయ నటుడు. హాస్య చిత్రం ప్యార్ కా పంచనామా (2011)లో తన నటనకు ఉత్తమ అరంగేట్రం - స్క్రీన్ అవార్డు గెలుచుకున్నాడు, ఆ తర్వాత, ఆయన చష్మే బద్దూర్ (2013), టాయిలెట్ః ఏక్ ప్రేమ్ కథ (2017) చిత్రాలలో సహాయక పాత్రలు పోషించాడు. అతను మిర్జాపూర్ (2018-2020) అనే డ్రామా సిరీస్, ది రైల్వే మెన్ (2023) వంటి చిన్న సిరీస్‌లలో తన పాత్రల ద్వారా మరింత దృష్టిని ఆకర్షించాడు.
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
రాజ్యసభ ("రాష్ట్రాల మండలి" అని అర్థం), ఇది భారత పార్లమెంటు ఎగువ సభ. ఆంధ్రప్రదేశ్ 11 స్థానాలను ఎన్నుకుంటుంది. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడతారు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన అభిమన్యు మిశ్రా, సెర్గీ కర్జాకిన్, గుకేష్ డి,జావోఖిర్ సిందరోవ్ తరువాత గ్రాండ్ మాస్టర్ (GM) టైటిల్ సాధించిన ఐదవ-పిన్న వయస్కుడు. ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ అయిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్లో ప్రపంచ నెంబర్ వన్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించడంతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు.
శుభ్‌మన్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్ టీంతో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శుభ్‌మన్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు.
చండ్ర రాజేశ్వరరావు (జూన్ 6, 1915 - ఏప్రిల్ 9, 1994) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న కమ్మ రైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 1992లో ఆనారోగ్యకారణాల వల్ల విరమించుకున్నాడు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (హైదరాబాదు)
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది భారతదేశం లోని హైదరాబాదు శేరిలింగంపల్లి మండలంలో ఒక సమాచార సాంకేతికత, రియల్ ఎస్టేట్, నిర్మాణ శివారు ప్రాంతం. ఇది సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.