The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మానవ్ జగదుసకుమార్ సుతార్ (జననం 3 ఆగస్టు 2002) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్లో రాజస్థాన్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఆయన 2022 ఫిబ్రవరి 17న 2021–22 రంజీ ట్రోఫీలో ఆంధ్రపై తన ఫస్ట్-క్లాస్, 2022–23 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 2022 అక్టోబర్ 11న మధ్యప్రదేశ్‌పై తన టీ20 అరంగేట్రం చేశాడు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నంది (నందీశ్వరుడు) శివుని వాహనం. శివుని సేవకుడిగా, కైలాస లోక సేనలకు అధిపతిగా కూడా ఉంటాడు. శైవ సిద్ధాంత సంప్రదాయం ప్రకారం, శైవమత జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఎనిమిది వేర్వేరు దిశల్లో పంపబడిన నంది ఎనిమిది మంది శిష్యులైన సనక, సనాతన, సనందన, సనత్కుమార, తిరుములర్, వ్యాగ్రాపాడ, పతంజలి, శివయోగ మొదలైన మునులకు ఈయనే ప్రధాన గురువు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
అజిత్ కుమార్ డోవల్, ఐపీఎస్ (రిటైర్డ్), పోలీస్ మెడల్, పిపిఎం, కెసి (జననం 1945 జనవరి 20) భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి సేవలందిస్తున్నారు. 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా పనిచేశారు, అంతకు ముందు దాదాపుగా దశాబ్ది కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968 కేరళ కేడర్ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన దోవల్, ఉగ్రవాద నిరోధక, రహస్య కార్యకలాపాలకు చేసిన కృషికి గుర్తింపు పొందారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
సలీం కుమార్ (1969 అక్టోబరు 10 - 2026 జూన్ 6), భారతదేశానికి చెందిన నటుడు, హాస్యనటుడు, దర్శకుడు, మలయాళ సినిమా రచయిత. ఆయన 2010లో ''అదామింటే మకాన్ అబు''లో నటనకుగాను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నాడు. సలీం కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ''కరుత జూతన్'' 2017లో ఉత్తమ కథ విభాగంలో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును, 2005లో ''అచనురంగత వీడు'' నటన విభాగంలో రెండవ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును, 2013లో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డును గెలుచుకున్నాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా
రాజ్యసభ ("రాష్ట్రాల మండలి" అని అర్థం), ఇది భారత పార్లమెంటు ఎగువ సభ. ఆంధ్రప్రదేశ్ 11 స్థానాలను ఎన్నుకుంటుంది. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడతారు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
శివ సహస్రనామాలు శివుని పేర్లు "వెయ్యి పేర్లు జాబితా" ఉంది, హిందూమతం అత్యంత ముఖ్యమైన దేవతలలో శివుడు ఒకరు. హిందూ మతం సంప్రదాయంలోని సహస్రనామాలు ఒక రకం భక్తి శ్లోకం (సంస్కృతం: స్తోత్రం ), ఒక దేవత యొక్క అనేక పేర్లు, సహస్రనామములు జాబితా లోని పేర్లు దైవాన్ని ప్రశంసించినట్లు అవుతోంది, ఆ దైవం సంబంధం లక్షణాలు, విధులు, ప్రధాన పురాణాలలో ఒక కూలంకషంగా జాబితా (కేటలాగ్) ను అందిస్తాయి. శివ సహస్రనామ స్తోత్రము వీటన్నింటి స్తోత్రరూపం.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
దివ్యేందు శర్మ (జననం 1983 జూన్ 19), హిందీ సినిమా, సిరీస్‌లలో పనిచేసే భారతీయ నటుడు. హాస్య చిత్రం ప్యార్ కా పంచనామా (2011)లో తన నటనకు ఉత్తమ అరంగేట్రం - స్క్రీన్ అవార్డు గెలుచుకున్నాడు, ఆ తర్వాత, ఆయన చష్మే బద్దూర్ (2013), టాయిలెట్ః ఏక్ ప్రేమ్ కథ (2017) చిత్రాలలో సహాయక పాత్రలు పోషించాడు. అతను మిర్జాపూర్ (2018-2020) అనే డ్రామా సిరీస్, ది రైల్వే మెన్ (2023) వంటి చిన్న సిరీస్‌లలో తన పాత్రల ద్వారా మరింత దృష్టిని ఆకర్షించాడు.
షణ్ముఖి ఆంజనేయ రాజు, ప్రసిద్ధ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త. గాన గంధర్వులుగా ప్రసిద్ధులైన షణ్ముఖి ఆంజనేయరాజు తెలుగు నాటక రంగంలో చిరస్మరణీయులు.వారి శ్రీకృష్ణ,శ్రీరామ పాత్రలు తెలుగు పౌరాణిక నాటక రంగాన్ని సుసంపన్నం చేశాయి.నటుడిగా, గాయకుడిగా,సంగీత విద్వాంసుడిగా,నాటక సంస్థ నిర్వాహకుడిగా,ఆయన స్థానం అద్వితీయమైనది.ధనసంపాదన కన్నా,ప్రేక్షకుల సంతృప్తి కే ప్రాధాన్యత నిచ్చిన అసలైన కళాకారుడు.
బోధిధర్మ సా.శ 5 లేదా 6వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ బౌద్ధ గురువు, తాత్వికుడు. ఇతను బౌద్ధ గురువుల పరంపరలో మొట్టమొదట చైనాకి వెళ్ళి అక్కడ చాన్ బౌద్ధం అనే పేరుతో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేశాడు. 17వ శతాబ్దంలో యిజిన్ జింగ్ అనే వ్యాయామ నియమావళి ఆధారంగా ఏర్పడి, 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన షావోలిన్ కుంగ్‌ఫూ కి ఇతనిడే ఆద్యుడు రూపకర్త.