The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచవచ్చునని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు ధ్రువీకరించాయి. భారతదేశంలో సుమారు 42% ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
విశాఖపట్నం భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద నగరం, అదే పేరుగల జిల్లాకు కేంద్రం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సూర్యుడు ( SOO-ree-ə; Sanskrit: सूर्य) అంటే సూర్యుడు అలాగే హిందూమతంలో సూర్య దేవుడు. ఆయన సాంప్రదాయకంగా స్మార్త సంప్రదాయంలోని ఐదుగురు ప్రధాన దేవతలలో ఒకరు, వీరందరినీ పంచాయతన పూజలో సమాన దేవతలుగా పరిగణిస్తారు, బ్రహ్మాన్ని గ్రహించడానికి ఒక మార్గం అని నమ్ముతారు. భారతీయ సాహిత్యం అంతటా, సూర్యునికి రవి, వైవస్వత, భాస్కర, మొదలైన బహుళ పేర్లు ఇవ్వబడ్డాయి.
బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.
నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. ఈ వ్యాధి కారకాన్ని అస్కారియాసిస్ (ascariasis) అంటారు, ఇవి పేగుల్లో నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవుల ఇవి నెలల్లో గుడ్లు, లార్వాలుగా వృద్ది చెందుతాయి. వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
సర్ డేవిడ్ రాబర్ట్ జోసెఫ్ బెక్హమ్ (జననం 2 మే 1975) ఒక ఇంగ్లీష్ మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఇతడు ప్రస్తుతం ఇంటర్ మయామి CFకి ప్రెసిడెంట్‌గా, సహ-యజమానిగా, అలాగే సాల్ఫోర్డ్ సిటీ F.C.కి సహ-యజమానిగా వ్యవహరిస్తున్నాడు. మైదానంలో ప్రధానంగా 'రైట్ మిడ్‌ఫీల్డర్'గా ఆడే బెక్హమ్, తన అద్భుతమైన పాసింగ్ శైలికి, కచ్చితమైన క్రాసింగ్ నైపుణ్యానికి, సెట్-పీస్ (ఫ్రీ కిక్స్) తీసుకోవడంలో ఉన్న ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు.
సుధారెడ్డి ఒక భారతీయ వ్యాపారవేత్త, సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్, పరోపకారి. 1989లో ఆమె భర్త కృష్ణారెడ్డి భారతదేశంలోని హైదరాబాదులో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించాడు. సుధారెడ్డి 2022లో నేషనల్ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్, అవార్డును అందుకుంది 2023లో ఆమె చేసిన దాతృత్వంనకు దుబాయ్‌లో ఆసియావన్ ద్వారా ఉమెన్ పయనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకుంది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ మంత్రి నేతృత్వం వహిస్తారు.ఇది భారత పార్లమెంటుకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహిస్తుంది రెండు సభలు, లోక్‌సభ ("హౌస్ ఆఫ్ ది పీపుల్," దిగువ సభ ) & రాజ్యసభ ("కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్," ఎగువ సభ ) మధ్య లింక్‌గా పనిచేస్తుంది. ఇది ఒక శాఖగా 1949లో సృష్టించబడింది కానీ తర్వాత పూర్తి మంత్రిత్వ శాఖగా మారింది.
భారత గృహ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రిత్వ శాఖ
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి ( హిందీ : आवासन और शहरी कार्य मंत्री ) 2017 జూలై 6న మంత్రిత్వ శాఖ ఏర్పడినప్పటి నుండి భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అధిపతి, కేంద్ర మంత్రుల మండలి సభ్యుడు. భారతదేశంలో గృహనిర్మాణం, పట్టణాభివృద్ధికి సంబంధించిన నియమాలు, నిబంధనలు, చట్టాల అమలు, సూత్రీకరణ, నిర్వహణకు మంత్రి బాధ్యత వహిస్తారు. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకు మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వం వహిస్తున్నాడు, అతను 2024 జూన్ 10 నుండి మంత్రిగా ఉన్నాడు.
పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.