The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచవచ్చునని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు ధ్రువీకరించాయి. భారతదేశంలో సుమారు 42% ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ముద్రగడ పద్మనాభం (అధికారిక గెజెట్లో ముద్రగడ పద్మనాభరెడ్డి; 1953 జనవరి 22 – 2026 జూలై 14) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి, 2014 నుండి కొంతకాలం ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నాడు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది.
సోనమ్ వాంగ్‌చుక్ (జననం: 1 సెప్టెంబర్ 1966) భారతీయ ఇంజనీరు, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త. లడఖ్ ప్రాంతంలో విద్యా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఆయన "స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)" సంస్థ స్థాపక-నిర్వాహకుడు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. సీదిరి అప్పలరాజు ప్రస్తుతం పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.
సప్తమాత్రికలు లేదా మాతృకలు (సంస్కృతం: मातृका (ఏకవచనం), IAST: mātṛkā, అక్షరార్థం "తల్లులు"), వీరిని మాతరలు, మాతృ అని కూడా పిలుస్తారు, వీరు హిందూమతంలో మాతృ దేవతల సమూహం. మాతృకలను తరచుగా ఏడుగురు దేవతల సమూహంగా, సప్తమాత్రికలు (ఏడుగురు తల్లులు) గా చిత్రీకరిస్తారు. అయితే, వారిని ఎనిమిది మంది దేవతల సమూహంగా, అష్టమాత్రికలు గా కూడా చిత్రీకరిస్తారు.
విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.
పరమశివన్ ఫాతిమా 2025లో విడుదలైన భారతీయ తమిళ భాషా హారర్ థ్రిల్లర్ సినిమా. లక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎసక్కి కార్వన్నన్ రచించి, దర్శకత్వం వహించి, నిర్మించాడు. విమల్, ఛాయాదేవి ప్రధాన పాత్రల్లో ఎంఎస్ భాస్కర్, కూల్ సురేష్, శ్రీరంజని సహాయక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) "A" (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇచ్చింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
సారా ఫలక్ (ఉర్దూ: 1992 జూలై 14), సారా జాఫర్ ఖాన్ (ఉర్దూ: 1992 జూలై 14) గా ప్రసిద్ధి చెందిన పాకిస్థానీ నటి. ఆమె 2012 సీరియల్ బడీ ఆపాలో సహాయక పాత్రతో నటనా రంగ ప్రవేశం చేసింది, తరువాత అనేక ధారావాహికలలో ఇతర సంక్షిప్త పాత్రలు పోషించింది. సబాత్ నాటకంలో మిరాల్ పాత్రను పోషించినందుకు ఖాన్ బాగా ప్రసిద్ధి చెందింది.
రాజ్యసంక్రమణ సిద్ధాంతం (Doctrine of Lapse) 1848, 1858కు మధ్య ఈస్టిండియా కంపెనీకి గవర్నరు జనరల్ గా పనిచేసిన డల్హౌసీ రూపొందించి, అమలుపరచిన రాజ్య ఆక్రమణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం అనేది భారత ఉపఖండంలో ఈస్టిండియా కంపెనీ ద్వారా రాచరిక రాష్ట్రాల గురించి ప్రారంభించిన విలీన విధానం. ఇది 1858 సంవత్సరం వరకు వర్తించబడింది, కంపెనీ పాలన తరువాత బ్రిటిష్ రాజ్ క్రిందకు వచ్చింది.ఈ సిద్ధాంతం ప్రకారం, ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యంలో క్రింద ఉన్న సామంత రాచరిక సంస్థానాలలో పాలకుడు అసమర్ధుడైనా లేదా పుత్రసంతానం లేకుండా మరణించినా, ఆ రాజ్యాలు అప్రమేయంగా ఈస్టిండియా కంపెనీ రాజ్యంలో కలిసిపోతాయి.
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో (తెలంగాణ భూభాగంలో 33%) మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
పోలవరం ప్రాజెక్టు, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
మాన్సీ జోషి (జననం 1994 సెప్టెంబరు 5), కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం టెలివిజన్ పరిశ్రమలలో పనిచేసే భారతీయ నటి. ఆమె కలర్స్ కన్నడలో కన్నడ టీవీ సిరీస్ రాధా రమణ తో అడుగుపెట్టింది. ఆమె టీవీ సిరీస్ మిస్టర్ మనైవి, అన్నా తంగి, పారు, చంద్రికయిలాలియున్నా చంద్రకాంత్ లలో ప్రధాన పాత్రలు పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.
శ్రీ మహామారియమ్మన్ ఆలయం, పెనాంగ్
అరుళ్మిగు శ్రీ మహామారియమ్మన్ ఆలయం పెనాంగ్ రాష్ట్రంలోని జార్జ్ టౌన్ లో ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయం. ఇది ఆ రాష్ట్రంలోనే అత్యంత పురాతన హిందూ దేవాలయంగా గుర్తించబడుతుంది. ఈ ఆలయం 1833లో నిర్మించబడింది.
ట్రాప్ ఫర్ ది సెవెన్ ఇటలీ సినిమా
"ట్రాప్ ఫర్ ది సెవెన్ స్పయిస్ " Trap for Seven Spies ఇటలీ,స్పెయిన్ దేశాల సంయుక్త నిర్మాణం ఈ సినిమా. Mario Amendola దర్శకత్వంలో 1966లో ఇటలీ, స్పెయిన్ భాషల్లో తీసిన సినిమా ఈ పేరుతో ఇంగ్లీషులోకి డబ్ చేశారు. అభిమానులు రహస్యంగా ఉంటూ యుద్ధంలో జర్మనీ ఓటమికి సహకరించిన ప్రజల మీద, కార్యకర్తలమీద ప్రతీకారం తీర్చుకోడానికి ప్రయత్నం చేయడమే ఈ సినిమా ఇతివృత్తం.
దేవా 2025లో హిందీలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. మలయాళంలో 2013లో విడుదలైన హిట్ సినిమా ముంబై పోలీస్ రీమేక్ గా నిర్మించిన ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించగా రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించాడు. ఈ సినిమాలో షాహిద్ కపూర్, పూజా హెగ్డే , పావైల్ గులాటి, ప్రవేశ్ రాణా ప్రధాన పాత్రలో నటించగా జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై తొలి రోజే రూ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.