The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
ముద్రగడ పద్మనాభం (అధికారిక గెజెట్లో ముద్రగడ పద్మనాభరెడ్డి; 1953 జనవరి 22 – 2026 జూలై 14) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి, 2014 నుండి కొంతకాలం ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నాడు.
సోనమ్ వాంగ్‌చుక్ (జననం: 1 సెప్టెంబర్ 1966) భారతీయ ఇంజనీరు, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త. లడఖ్ ప్రాంతంలో విద్యా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఆయన "స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)" సంస్థ స్థాపక-నిర్వాహకుడు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచవచ్చునని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనలు ధ్రువీకరించాయి. భారతదేశంలో సుమారు 42% ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 28 న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించారు.
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ దేశంలో అతిపెద్ద ఎసెట్ మేనేజేమెంట్ కంపెనీ (ఎఎంసి) పొదుపులకు, పెట్టుబడులకు మధ్య ఖాళీని పూడ్చడంపై, సింపుల్గా ఉండే, సంబంధిత పెట్టుబడి పరిష్కారాల శ్రేణి ద్వారా ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపద సృష్టించడంపై దృష్టిపెడుతోంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సీతాకోకచిలుకలు (ఆంగ్లం Butterfly) ఒక అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు. ఇవి లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత metamorphosis చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.
జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి (1910–1973) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి 1924, నవంబరు 2వ తేదీన, కడప జిల్లా, తాటిమాకులపల్లెలో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం పులివెందుల బోర్డు ఉన్నత పాఠశాలలో, అనంతపురంలోని సి.డి.కళాశాలలో సాగింది. ఆ తర్వాత మద్రాసు న్యాయకళాశాలలో న్యాయశాస్త్ర పట్టభద్రుడయ్యాడు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
లియోనెల్ "లియో" ఆండ్రెస్ మెస్సీ (ఆంగ్లం: Lionel Messi), 1987 జూన్ 24లో జన్మించారు అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ కెప్టెన్‌గా వ్యవహరించే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలను పొందాడు. ఫుట్బాల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతమైన పేరు గడించాడు, మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది బాలన్ డి'ఓర్ అవార్డులు, ఫిఫా ద్వారా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పురస్కారాలు గెలుచుకున్నాడు, ఒక రికార్డు ప్రకారం ఆరు సార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురసకారాన్ని , బాలన్ డి’ఓర్ డ్రీమ్ టీమ్ లో చోటు కూడా మెస్సి సొంతం.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
తిథి అంటే : వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య, అదే సూర్యచంద్రులు ఒకరికి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.. తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు.
శ్వాస మార్గానికి బయటి వస్తువులు అడ్డంపడి ఉక్కిరిబిక్కిరి చేసినపుడు చేసే ప్రథమ చికిత్స, పొత్తికడుపును నొక్కే ప్రక్రియ. అమెరికన్ వైద్యుడు హెన్రీ హీమ్లిచ్ దీన్ని కనుగొన్నాడు. ఈ చికిత్స చేసేవారు, ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాధితుడి వెనుక నిలబడి, బాధితుడి డయాఫ్రమ్ దిగువన తమ చేతులను బిగించి, బలంగా నొక్కుతూ, వదులుతూ కుదుపులు ఇవ్వాలి.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
ది ఒడిస్సీ (The Odyssey) అనేది క్రిస్టోఫర్ నోలన్ రచించి స్వీయ దర్శకత్వంతో రూపొందుతున్న పురాణ యాక్షన్ ఫాంటసీ చిత్రం. "హోమర్" యొక్క పురాతన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది "ది ఒడిస్సీ". ఈ చిత్రంలో ఒడిస్సియస్ గా మాట్ డామన్, గ్రీకు రాజుగా ఇథాకా, ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్‌గా టామ్ హాలండ్, గ్రీకు దేవత ఎథీనా (Athena) పాత్రలో జెండయా నటిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
జూలై (July) నెల, జూలియన్,గ్రెగోరియన్ క్యాలెండర్లు ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఏడవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.పురాతన రోమన్ క్యాలెండర్లో ఐదవ నెల కావడంతో జూలై నెలను గతంలో లాటిన్లో "క్విన్టిలిస్" అని పిలిచేవారు. జూలియన్ క్యాలెండర్ సంస్కరణ సందర్భంగా జూలియస్ సీజర్ గౌరవార్థం నెల పేరు జూలైగా మార్చబడింది.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (సినిమా)
ఆంధ్ర దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగిపురుషుని జీవి కథను నందమూరి తారకరామారావు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు. తానే స్వయంగా నటించాడు, దర్శకత్వం వహించాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారత జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
భారత పురుషుల జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు అండర్-19 స్థాయిలో క్రికెట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుం. ఈ జట్టు ఐదు అండర్-19 ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అండర్-19 జాతీయ జట్లన్నిటి లోకీ వన్డేలలో అత్యుత్తమ విజయాల శాతం రికార్డు ఈ జట్టుదే.