The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
సోనమ్ వాంగ్‌చుక్ (ఆంగ్లం: Sonam Wangchuk; జననం: 1966 సెప్టెంబరు 1), భారతీయ ఇంజనీరు, విద్యా సంస్కర్త, ఆవిష్కర్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త. లడఖ్ ప్రాంతంలో విద్యా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాలలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. ఆయన "స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)" సంస్థ స్థాపక-నిర్వాహకుడు.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్గ్రాడ్యుయేట్) (లేదా నీట్ (యుజి) ) భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్ష. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి) అనేవారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
ది ఒడిస్సీ (The Odyssey) అనేది క్రిస్టోఫర్ నోలన్ రచించి స్వీయ దర్శకత్వంతో రూపొందుతున్న పురాణ యాక్షన్ ఫాంటసీ చిత్రం. "హోమర్" యొక్క పురాతన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది "ది ఒడిస్సీ". ఈ చిత్రంలో ఒడిస్సియస్ గా మాట్ డామన్, గ్రీకు రాజుగా ఇథాకా, ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్‌గా టామ్ హాలండ్, గ్రీకు దేవత ఎథీనా (Athena) పాత్రలో జెండయా నటిస్తున్నారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
లియోనెల్ "లియో" ఆండ్రెస్ మెస్సీ (ఆంగ్లం: Lionel Messi), 1987 జూన్ 24లో జన్మించారు అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ కెప్టెన్‌గా వ్యవహరించే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలను పొందాడు. ఫుట్బాల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతమైన పేరు గడించాడు, మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది బాలన్ డి'ఓర్ అవార్డులు, ఫిఫా ద్వారా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పురస్కారాలు గెలుచుకున్నాడు, ఒక రికార్డు ప్రకారం ఆరు సార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురసకారాన్ని , బాలన్ డి’ఓర్ డ్రీమ్ టీమ్ లో చోటు కూడా మెస్సి సొంతం.
కమిటీ కుర్రోళ్లు 2024లో విడుదలైన తెలుగు సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై కొణిదెల నీహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 14న, ట్రైలర్‌ను జులై 26న విడుదల చేయగా, సినిమా ఆగస్ట్ 9న సినిమా విడుదలైంది.
ముద్రగడ పద్మనాభం (అధికారిక గెజెట్లో ముద్రగడ పద్మనాభరెడ్డి; 1953 జనవరి 22 – 2026 జూలై 14) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు. గతంలో భారత జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పనిచేసి, 2014 నుండి కొంతకాలం ఏ పార్టీ లోనూ చేరకుండా ఉన్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup), లేదా క్లుప్తంగా ప్రపంచ కప్, అని పేరొందిన ఫుట్‌బాల్ పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీ అని చెప్పవచ్చు. ఈ పోటీలో ఫుట్‌బాల్ ఆటలో వాసికెక్కిన జాతీయ జట్లు, తమ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఆటలపోటీలు 1930 లో మొదలయ్యి, నాలుగేళ్ళకోసారి (1942,46 లో ద్వితీయ ప్రపంచ యుద్ధం మూలాన తప్ప) కొనసాగుతూ వస్తున్నాయి.
గుల్షన్ దేవయ్య భారతదేశానికి చెందిన నటుడు. ఆయన 2010లో 'దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి షైతాన్, హేట్ స్టోరీ, హంటర్ సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని షైతాన్‌లో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకొని ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ పొందాడు.
సీతాకోకచిలుకలు (ఆంగ్లం Butterfly) ఒక అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు. ఇవి లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత metamorphosis చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.
రెబెకా మెర్సర్ (జననం డిసెంబరు 6, 1973) అమెరికన్ వారసురాలు, రిపబ్లికన్ రాజకీయ దాత, మెర్సర్ ఫ్యామిలీ ఫౌండేషన్ డైరెక్టర్. మెర్సర్లు సంప్రదాయవాద కారణాలలో పాల్గొన్నప్పుడు మెర్సర్ కుటుంబం కోసం రాజకీయ ప్రాజెక్టుల రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం ప్రారంభించాడు. ఆమె తండ్రి, బిలియనీర్ రాబర్ట్ మెర్సర్ 2017 నవంబరులో న్యూస్ సైట్ బ్రీట్బార్ట్లో తన వాటాను తన కుమార్తెలకు విక్రయించినట్లు చెప్పారు.
ధర్మేంద్ర ప్రధాన్ (జననం 1969 జూన్ 26) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఇతను 2017 సెప్టెంబరు 3న కేంద్ర మంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు ఈయన 14వ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు.
సెమ్మలార్ అన్నం ఒక భారతీయ నటి, తమిళ భాషా చిత్రాలలో పనిచేస్తుంది. కాలేజీలో చదువుకునే రోజుల్లో పదిహేనుకు పైగా లఘు చిత్రాలకు దర్శకత్వం వహించి, నటించింది. లక్ష్మి రామకృష్ణన్ దర్శకత్వం వహించిన అమ్మాని (2016) చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన తరువాత, ఆమె మాదతి (2019), సెన్నాయ్ (2021), మలయాళ చిత్రం మమ్మ్మ్ (2021) వంటి చిత్రాలలో నటించింది.
తిథి అంటే : వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య, అదే సూర్యచంద్రులు ఒకరికి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.. తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు.
బ్రూస్ లీ (నవంబరు 27, 1940 - జులై 20, 1973) అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన మార్షల్ ఆర్టిస్ట్ (యుద్ధ క్రీడా నిపుణుడు), నటుడు, నిర్మాత, తత్వవేత్త. ఇతను తాను ఆచరించిన నిరాయుధ పోరాటం, ఆత్మరక్షణ పద్ధతులు, జెన్ బౌద్ధం, టావోయిజం లాంటి అనేక సాంప్రదాయాల మిశ్రమమైన జీత్ కున్ డు అనే ఒక హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ తత్వాన్ని కనిపెట్టాడు. అటు అమెరికా, ఇటు హాంగ్‌కాంగ్ దేశాల సినిమాలలో నటించిన లీ, చైనా ప్రాంతం నుంచి వచ్చిన మొట్టమొదటి గ్లోబల్ స్టార్ అని చెప్పవచ్చు.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.