The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 19న జరిగిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై అత్యాచారం హత్య ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు సీబీఐ విచారణకు మారగా, విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.
సుందరకాండ 2025లో విడుదలైన తెలుగు సినిమా. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించాడు. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 26న విడుదల చేశారు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
భూమి వాతావరణం, భూమ్యాకర్షణ శక్తి వల్ల భూమిని అంటిపెట్టుకుని ఉన్న వాయువులతో నిండి ఉన్న పొర. భూమిని ఆవరించి ఉన్న ఈ పొరలో సుమరుగా 78.08% నత్రజని, 20.95% ఆమ్లజని, 0.93% ఆర్గాన్, 0.038% కార్బన్ డై ఆక్సైడ్, అటూఇటుగా ఒక శాతం నీటి ఆవిరి, అతిస్వల్ప పరిమాణాలలో ఇతర వాయువులు ఉన్నాయి. ఈ వాయువుల కలయికను సాధారణంగా గాలి అని పిలుస్తారు.
కంప్యూటర్ భద్రత లేదా సైబరు భద్రత లేదా సమాచార భద్రత అనేది కంప్యూటర్, హార్డువేరు, సాఫ్టువేరు లేదా అందులో ఉన్న సమాచారం దొంగిలించ బడకుండా, పాడుచేయకుండా పనిచేసే ఒక రక్షణ వ్యవస్థ. కంప్యూటర్ అందించే సేవలకు అంతరాయం కలిగించడాన్ని, లేదా వాటిని తప్పుదారి పట్టించడాన్ని అడ్డుకోవడం కూడా కంప్యూటర్ భద్రతలో భాగమే. హార్డువేరుకు భౌతిక రక్షణ కల్పించడం, నెట్వర్క్ (వలనడి) ద్వారా వచ్చే ఉపద్రవాలనుంచి వాటిని కాపాడటం, సమాచార, కోడ్ (సంకేత భాష) రక్షణ మొదలైనవన్నీ కంప్యూటర్ భద్రతకు సంబంధించిన అంశాలే.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
లియోనెల్ "లియో" ఆండ్రెస్ మెస్సీ (ఆంగ్లం: Lionel Messi), 1987 జూన్ 24లో జన్మించారు అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఆడుతూ కెప్టెన్‌గా వ్యవహరించే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తరచుగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలను పొందాడు. ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతమైన పేరు గడించాడు, మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది బాలన్ డి'ఓర్ అవార్డులు, ఫిఫా ద్వారా ఎనిమిది సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పురస్కారాలు గెలుచుకున్నాడు, ఒక రికార్డు ప్రకారం ఆరు సార్లు యూరోపియన్ గోల్డెన్ బూట్ పురసకారాన్ని , బాలన్ డి’ఓర్ డ్రీమ్ టీమ్ లో చోటు కూడా మెస్సి సొంతం.
హతిజే హైరియే అయ్షే దుర్రూషెహ్వార్ సుల్తాన్ (Hatice Hayriye Ayşe Dürrüşehvar Sultan) (ఒట్టోమన్ టర్కిష్: خدیجه خیریه عائشه درشهوار سلطان, "గౌరవప్రదమైన మహిళ", "ఆశీర్వదించబడినది", "అంగనామణి", "రాజయోగ్యమైన ముత్యం"), వివాహం తరువాత దుర్రూషెహ్వార్ దుర్దానా బేగం సాహిబా, బెరార్ యువరాణి (26 జనవరి 1914 - 7 ఫిబ్రవరి 2006) ఒట్టోమన్ యువరాణి, ఒట్టోమన్ సామ్రాజ్య సింహాసనానికి చివరి వారసుడు, ఒట్టోమన్ ఖిలాఫత్ యొక్క చివరి ఖలీఫా, రెండవ అబ్దుల్‌మజీద్ యొక్క ఏకైక కుమార్తె.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ. ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది. వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రావు బహదూర్ అనేది వెంకటేష్ మహా రచన, దర్శకత్వం మరియు కూర్పు (ఎడిటింగ్) లో రాబోతున్న ఒక భారతీయ తెలుగు భాష సైకలాజికల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించగా, వికాస్ ముప్పాల, దీపా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో, A+S మూవీస్ మరియు శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.
1972 జూలై 8 న జన్మించిన సౌరవ్ గంగూలీ (Sourav Chandidas Ganguly) (Bengali: সৌরভ গাঙ্গুলী) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. కోల్‌కతకు చెందిన ఈ క్రీడాకారుడు టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. ఎడమచేతితో బ్యాటింగ్, కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీకి బెంగాల్ టైగర్, కోల్‌కత యువరాజు, దాదా అనే ముద్దుపేర్లు ఉన్నాయి.
యెడుగూరి సందింటి రాజారెడ్డి (1925 - 1998 మే 23) కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త. బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవాడు. అతని కుమారుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగానూ, అతని మనుమడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ కు రెండవ ముఖ్యమంత్రిగాను పనిచెసారు.
జవహర్ నవోదయ విద్యాలయాలు (సంక్షిప్తంగా జె ఎన్ వి లు) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల వ్యవస్థ. ఈ పాఠశాలలను భారత ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ, విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నవోదయ విద్యాలయ సమితి అనే స్వతంత్ర సంస్థ నిర్వహిస్తుంది. జెఎన్వీలు గురుకుల పాఠశాల పద్ధతిలో, బాల బాలికలకు విద్యనందిస్తాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్వంతం చేసుకున్న జ్యోతి బసు 1914 జూలై 8న కోల్‌కాతాలో జన్మించారు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి చెందిన జ్యోతి బసు 1977 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. అంతకు ముందు 1967-69 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
ఇల్లాలు ప్రియురాలు (2006 సినిమా)
ఇల్లాలు ప్రియురాలు 2006, ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. భానుశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, దివ్య ఉన్ని, ప్రకాష్ రాజ్, జయసుధ, బ్రహ్మానందం, చంద్రమోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.
ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.
బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు. బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
నందమూరి తారక రామారావు (1928 మే 28 - 1996 జనవరి 18) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు, తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించాడు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
చేరామన్ జామా మస్జిద్ లేదా చేరామన్ జుమా మస్జిద్ (Cheraman Jum'ah Masjid (మలయాళం: ചേരമാൻ ജുമാ മസ്ജിദ്) (ఉర్దూ - چیرامن جامع مسجد ) భారతదేశంలో మొదటి మస్జిద్ (మసీదు) చేరామన్ జమా మసీదు కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా లోని చిన్న పట్టణం కొడంగళూర్, మలబార్ తీరంలో ఉంది.. ==తొలిచరిత్ర== సా.శ. 629లో నిర్మించబడ్డ చేరామన్ జమా మసీదు భారతదేశంలోనే మొట్ట మొదటి ముస్లింల ప్రార్థనా మందిరంగా పరిగణించబడుతుంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
మంత్ ఆఫ్ మధు 2023లో తెలుగులో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. కృషివ్ ప్రొడక్షన్, హ్యాండ్పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్‌పై యస్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 సెప్టెంబర్ 29న విడుదల చేసి, ట్రైలర్‌ను 2023 సెప్టెంబర్ 26న నటుడు సాయి ధరమ్ తేజ్ విడుదల చేయగా, సినిమాను అక్టోబర్ 06న విడుదల చేశారు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అనేది ఇంటింటి లెక్కింపు, ముందే నింపిన ఫారాలు, పాత ఓటరు డేటా ధ్రువీకరణ ద్వారా ఓటరు జాబితాలను ధ్రువీకరించడానికి, సవరించడానికి భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ఒక ప్రక్రియ. అర్హులైన పౌరులు తప్పిపోకుండా చూసుకుంటూ, మరణించిన, శాశ్వతంగా మార్చబడిన, నకిలీ, పౌరులు కాని ఓటర్ల పేర్లను తొలగించడం ద్వారా భారతదేశం అంతటా ఓటర్ల జాబితాలు కచ్చితమైనవని నిర్ధారించడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) లక్ష్యం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను 2025 అక్టోబరు 27న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించాడు.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
పెద్ది 2026లో విడుదలకానున్న తెలుగు భాషా యాక్షన్ డ్రామా సినిమా. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించాడు. ఆర్.సి.16 వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరించబడిన ఈ సినిమా మార్చి 2025లో "పెద్ది"గా అధికారికంగా ప్రకటించారు.