The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
లెనిన్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం
అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం విమానాశ్రయం లేదా జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయమని కూడా పిలుస్తారు) విజయనగరం జిల్లా భోగపురంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టారు.
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రావు బహదూర్ అనేది వెంకటేష్ మహా రచన, దర్శకత్వం మరియు కూర్పు (ఎడిటింగ్) లో రాబోతున్న ఒక భారతీయ తెలుగు భాష సైకలాజికల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించగా, వికాస్ ముప్పాల, దీపా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జి.ఎమ్.బి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో, A+S మూవీస్ మరియు శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు 2026లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ నిరించిన ఈ సినిమాకు కమల్‌తేజ నార్ల దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 మే 21న, ట్రైలర్‌ను జూన్ 12న విడుదల చేసి సినిమాను జూన్ 19న విడుదల చేశారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
పవనస్థితి లేదా వాతావరణస్థితి అనగా వేడి లేదా చల్లని, తడి లేదా పొడి, ప్రశాంతత లేదా ఈదర, స్పష్టమైన లేదా మేఘావృతమైన డిగ్రీకి వాతావరణం యొక్క స్థితి. అత్యధిక పవనస్థితి విషయాలు స్ట్రాటో ఆవరణమునకు కొద్దిగా క్రింద ట్రోపో ఆవరణములో ఏర్పడుతాయి. పవనస్థితి ఉష్ణోగ్రత, అవక్షేపణ కార్యాచరణను అనునిత్యం సూచిస్తుంది, అయితే క్లైమేట్ అనే పదం చాలా ఎక్కువ కాలం పైగా వాతావరణ పరిస్థితుల యొక్క గణాంకాలను సూచిస్తుంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మట్టి కుస్తీ తెలుగులో విడుదల కానున్న సినిమా. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై తమిళంలో గట్ట కుస్తీ పేరుతో, తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రవితేజ, విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్ నిర్మించిన ఈ సినిమాకు చెల్ల అయ్యవు దర్శకత్వం వహించాడు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబరు 20న విడుదల చేసి, సినిమా డిసెంబరు 2న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై,జనవరి 1న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.
మ్యాడ్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.
కింజరాపు ఎర్రన్నాయుడు (23 ఫిబ్రవరి, 1957 - 2 నవంబర్, 2012 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్‌వీప్‌గా, నాలుగుసార్లు లోక్‍సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రైల్వే, అగ్రికల్చర్ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా, పార్లమెంట్ హౌస్‌లో ఫుడ్ కమిటీ ప్రతినిధిగా వివిధ పదవులు నిర్వహించాడు.
ట్రూ లవర్ 2024లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. తమిళంలో మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్‍కేఎన్, మారుతీ ఈ సినిమాను విడుదల చేశారు. కె.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
అరకు లోయలోని గిరిజనుల సాంప్రదాయ నృత్యాలలో దింసా నృత్యం ప్రసిద్ధమైనది. ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులు సామూహికంగా నర్తించే దింసా నృత్యం దేశంలో విశేషాదరణ పొందింది. వాల్మీకులు, బగతలు, కోటియా, ఖోండ్, కొలాములు, మూఖ దొరలు లాంటి సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ సంప్రదాయ నృత్యంలో పాల్గొంటారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IATA: HYD, ICAO: VOHS), "హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం" లేదా సూక్ష్మంగా RGIA గా పిలువబడుతుంది. ఈ విమానాశ్రయం హైదరాబాదు నగరానికి సుమారు 22 కి.మీ దూరంలో శంషాబాద్ వద్ద నెలకొల్పబడింది. దీని పేరును భారత దేశ పూర్వపు ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన పేరుతో నామకరణం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా (2014-2019), (2024- ప్రస్తుతం) విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
రైటర్ పద్మభూషణ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. జీ మనోహరన్ సమర్పణలో లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. సుహాస్, టీనా శిల్పారాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 03న విడుదలైంది.
పోలీస్ కంప్లైంట్ 2026లో విడుదలైన తెలుగు-కన్నడ భాషా హారర్ థ్రిల్లర్ సినిమా. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మాకినేని కృష్ణ సాయి నిర్మించిన ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 31న విడుదల చేసి, సినిమాను జూన్ 12న విడుదల చేశారు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
భూ భారతి పొర్టల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్వవసాయ భూముల నిర్వహణకు కోసం భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, హైదరాబాదు లోని శిల్పకళా వేదిక , హైటెక్ సిటీ, మాదాపూర్ లో తేది:14 ఏప్రిల్ 2025 న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భూపరిపాలనలోని ధరణి స్థానంలో కొత్త ఆర్.ఓ .ఆర్ చట్టం భూ భారతి పొర్టల్ -2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.