The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమం" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగాలు. భారత ఉపఖండం లోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
లీచీ (లీ -చీ ; లిచి చినెన్సిస్ ; చైనీస్ :荔枝; పిన్యిన్ : లీఝీ ; జ్యుట్‌పింగ్ : లై6 జి1 ; పెహ్-ఓ-జీ : నై-చీ) అనేది ఒకే జాతి గల టాక్సాన్, సపిండేసి కుటుంబంలోని (Sapindaceae) లిచి ప్రజాతిలో ఏకైక సభ్యుడు. ఈ పండు తినదగినది తీపి, కొద్దిగా పుల్లని రుచిని కలిగి ఉంటుంది, తరచుగా గులాబీ లాంటిదిగా వర్ణించబడే ఒక విలక్షణమైన పూల సువాసనను కలిగి ఉంటుంది. లీచీలో మూడు విభిన్న ఉపజాతులు ఉన్నాయి.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్ , , పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి. కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రానికి తొలి వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేశాడు. ఆయన 2018 వ సంవత్సరం లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తరపున బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికై 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
బలూచిస్తాన్ పాకిస్తానులోని అతి ముఖ్యమైన ప్రావిన్సులలో ఒకటి. బలూచిస్తాను పాకిస్తానులో అతిపెద్ద భూభాగం కలిగిన జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం. దీనికి ఈశాన్యంలో ఖైబరు పఖ్తుంఖ్వా, తూర్పున పాకిస్తాను పంజాబు, ఆగ్నేయంలో సింధు అనే పాకిస్తాను ప్రావిన్సులు సరిహద్దులుగా ఉన్నాయి; పశ్చిమాన ఇరాన్, ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
రుతురాజ్ దశరత్ గైక్వాడ్ (జననం 31 జనవరి 1997) భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర తరపున, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు. అతను 2021 ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్నాడు.
జనగణమన భారత గణతంత్రం నకు జాతీయ గీతం. దీనిని తొలుత బెంగాలీలో "భారత భాగ్య విధాతా" గా బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యకర్త, భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911 డిసెంబరు 11 న రచించాడు "భారత భాగ్య విధాతా" గీతంలోని మొదటి చరణాన్ని, తొలుత బ్రహ్మ సమాజం కోసం హిందూ మతపరమైన స్తోత్రంగా రచించగా, భారత రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 24 న జాతీయ గీతంగా స్వీకరించింది. జాతీయ గీతాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడానికి సుమారు 52 సెకన్ల సమయం పడుతుంది.
పెళ్ళి చేసి చూడు (1988 సినిమా)
డ్పెళ్ళిచేసి చూడు 1988 లో విడుదలైన తెలుగు సినిమా. కౌసల్య పిక్చర్స్ పతాకంపై బి. కౌసల్య నిర్మించింది రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
గీతు మోహన్ దాస్ గా వృత్తిపరంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి దాస్ (జననం 8 జూన్ 1981) ఒక భారతీయ నటి, దర్శకురాలు. 2013 లో, ఆమె దర్శకత్వం వహించిన సోషియో పొలిటికల్ చిత్రం లైయర్స్ డైస్ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది, ఆస్కార్ గా ప్రసిద్ధి చెందిన యు.ఎస్ 87 వ అకాడమీ అవార్డులకు భారతదేశ ప్రవేశంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసింది, కానీ షార్ట్ లిస్ట్ చేయబడలేదు లేదా నామినేట్ చేయబడలేదు.
పొట్టి ప్లీడరు 1966 మే 5లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పద్మనాభం, గీతాంజలి, శోభన్ బాబు, వాణిశ్రీ, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, నిర్మలమ్మ, వల్లూరి బాలకృష్ణ, రావికొండలరావు, ప్రభాకరరెడ్డి, ముక్కామల కృష్ణమూర్తి, పేకేటి శివరాం, వంగర వెంకటసుబ్బయ్య, పెరుమాళ్ళు, డి.రామానాయుడు నటించగా, ఎస్.పి.కోదండపాణి సంగీతం అందించారు.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నడియాడ్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.
భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయ రంగు, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్‌కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు.
సార్ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్, సంయుక్త మీనన్, సాయికుమార్, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లుక్, మోషన్ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజర్‌ను 2022 జులై 28న విడుదల చేసి, సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
బలూచిస్తాను ( bə-LOHTCH-ist-a(h)n-,_-; Balochi: Balòcestàn, బలూచిస్తాను లేదా బలూచిస్తాను అని కూడా పిలువబడే [baˈloːt͡ʃest̪ɑːn], పశ్చిమ, దక్షిణ ఆసియాలోని చారిత్రక ప్రాంతం. ఇది ఇరానియను పీఠభూమికి ఆగ్నేయంలో, ఇండియను ప్లేటు అరేబియా సముద్రం తీరప్రాంతాన్ని సరిహద్దుగా కలిగి ఉంది. ఎడారి పర్వతాలతో కూడిన ఈ శుష్క ప్రాంతంలో ప్రధానంగా బలూచు ప్రజలు నివసిస్తున్నారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.