The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రాఘవ్ జుయల్ (జననం 10 జూలై 1991) భారతీయ నటుడు, నృత్యకారుడు, కొరియోగ్రాఫర్ & టెలివిజన్ ప్రెజెంటర్. స్లో మోషన్ శైలిలో తన సర్రియల్ డ్యాన్స్ మూవ్‌లకు & భారతదేశంలో స్లో మోషన్ వాక్‌ను తిరిగి ఆవిష్కరించినందుకు అతను "క్రోక్రోక్స్" లేదా "కింగ్ ఆఫ్ స్లో మోషన్" అని ప్రసిద్ధి చెందాడు. జీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ 3లో పోటీదారుగా, ఫైనలిస్ట్‌గా, డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ 2, డాన్స్ కే సూపర్‌కిడ్స్‌లలో రాఘవ్ కే రాక్‌స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తర్వాత గుర్తింపు పెరిగింది, అక్కడ అతని జట్టు అతని కెప్టెన్‌షిప్‌లో విజేతగా ప్రకటించబడింది.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
కాసర్ల శ్యామ్ వర్థమాన సినీ పాటల రచయిత. మహాత్మ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాటల రాసిన శ్యామ్ 2020లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటతో గుర్తింపు పొందాడు. బలగం సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన ఊరు పల్లెటూరు అనే గీతానికి గాను 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.
ఖైరతాబాదు వినాయకుడు (ఖైరతాబాదు గణేషుడు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాదులో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయకుడు. 11రోజులపాటు జరిగే ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండేకాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు. 11వ రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు.
డ్రింకర్ సాయి ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' 2024లో విడుదలైన ప్రేమకథా సినిమా. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన ఈ సినిమాకు కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించాడు. ధర్మ కాకాని, ఐశ్వర్యశర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 15న, ట్రైలర్‌ను డిసెంబర్ 9న విడుదల చేయగా సినిమా డిసెంబర్ 27న విడుదలైంది.
వామనుడు లేదా త్రివిక్రముడు, హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం. వామనుడు అదితికి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు. వామనుడు అనగానే తెలుగు వారికి "ఇంతై ఇంతై వటుండంతై " అన్న పోతన భాగవత పద్యము తెలుగునాట సుపరిచితం.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
వినాయకుడు, / గణపతి/విఘ్నేశ్వరుడు హిందూ దేవుళ్లల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుని స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయాలు ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.
రంగబలి 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించాడు. నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో, శరత్‌కుమార్, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 జులై 27న విడుదల చేసి సినిమాను జులై 7న విడుదల చేశారు.
ప్రభాస్గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
విశ్వనాథ్ అండ్ సన్స్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చ్ 16న, ట్రైలర్‌ను ఆగష్టు 7న విడుదల చేసి, సినిమాను ఆగష్టు 14న విడుదల అయింది.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
పేరు :క్లౌడ్ సీడింగ్ మరో పేరు = కృత్రిమ వర్షం caption = విమానం ద్వారా క్లౌడ్ సీడింగ్ చేస్తున్న దృశ్యం రకము = వాతావరణ మార్పిడి రసాయనం = సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ క్లౌడ్ సీడింగ్ అనేది కృత్రిమంగా వర్షం కురిపించే ఒక వాతావరణ మార్పిడి సాంకేతికత. దీనిని కృత్రిమ వర్షం లేదా మేఘ విత్తనం అని కూడా అంటారు. ఇది కొత్త మేఘాలను సృష్టించదు, కానీ ఉన్న మేఘాల నుండి ఎక్కువ వర్షం లేదా మంచు పడేలా చేస్తుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.