The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 సెప్టెంబరు 26 - 1946 జూన్ 17) కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు.
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
మాలపున్నమి లేదా మహలయ పౌర్ణమి పండుగను పల్లె ప్రజలు 'మాల పున్నం' అంటారు. చదువుకొనె వారు మహలయ పౌర్ణమి అంటారు.ఇది రాయలసీమ జిల్లాలలో జరుపుకొనె ఒక పండుగ.ఇది తెలుగునెల ప్రకారం భాద్రాపాద మాసంలో పున్నమి నాడు హరిజనులు చేసుకొనే పండుగ.అంటే ఇంగ్లీషునెల ప్రకారం ఆగష్టు కడపటి వారంలో గాని, సెప్టెంబరు మొదటివారంలో కాని వస్తుంది. మాలపున్నం నగరాలలో అంతగా కనిపించదు.
జ్ఞానేష్ కుమార్ (జననం 1964 జనవరి 27), 1988 జట్టుకు చెందిన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి, కేరళ కేడర్ కు చెందిన అతను 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేస్తున్నారు. అతను 2025 ఫిబ్రవరి 17న ఈ పదవికి నియమితులయ్యారు.గతంలో జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల కమిషనరుగా పనిచేశారు. అలాగే అతను 2024 జనవరి 31న భారత సహకార కార్యదర్శి పదవి నుండి పదవీ విరమణ చేశారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
రాఘవ్ జుయల్ (జననం 10 జూలై 1991) భారతీయ నటుడు, నృత్యకారుడు, కొరియోగ్రాఫర్ & టెలివిజన్ ప్రెజెంటర్. స్లో మోషన్ శైలిలో తన సర్రియల్ డ్యాన్స్ మూవ్‌లకు & భారతదేశంలో స్లో మోషన్ వాక్‌ను తిరిగి ఆవిష్కరించినందుకు అతను "క్రోక్రోక్స్" లేదా "కింగ్ ఆఫ్ స్లో మోషన్" అని ప్రసిద్ధి చెందాడు. జీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ 3లో పోటీదారుగా, ఫైనలిస్ట్‌గా, డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ 2, డాన్స్ కే సూపర్‌కిడ్స్‌లలో రాఘవ్ కే రాక్‌స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తర్వాత గుర్తింపు పెరిగింది, అక్కడ అతని జట్టు అతని కెప్టెన్‌షిప్‌లో విజేతగా ప్రకటించబడింది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ప్రీతి ముండే (Preethi Munde) ఒక భారతీయ మోడల్, అందాల రాణి. ఆమె తెలంగాణ రాష్ట్రం ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామంలో జన్మించింది. యోగా శిక్షకురాలు ఆమె రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీలలో 'మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026' (Miss Earth Water India 2026) కిరీటాన్ని కైవసం చేసుకుని వార్తల్లో నిలిచారు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఖైరతాబాదు వినాయకుడు (ఖైరతాబాదు గణేషుడు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాదులో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయకుడు. 11రోజులపాటు జరిగే ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండేకాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు. 11వ రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, ఏప్రిల్ 2022లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని కోఠి మహిళా కళాశాలను తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయంగా ప్రకటించింది. ఆ తర్వాత 2024లో అది వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా అవతరించింది. కాగా, దీనికి మార్చి 2025లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు లభించింది.
కార్తీకదీపం (బుల్లితెర ధారావాహిక)
కార్తీక దీపం ఒక భారతీయ తెలుగు బుల్లితెర ధారావాహిక. ఇది స్టార్ మాలో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవుతుంది, హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం అవుతుంది. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ఈ ధారావాహికలో ప్రధాన పాత్రధారులు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
డ్రింకర్ సాయి ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' 2024లో విడుదలైన ప్రేమకథా సినిమా. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన ఈ సినిమాకు కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించాడు. ధర్మ కాకాని, ఐశ్వర్యశర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 15న, ట్రైలర్‌ను డిసెంబర్ 9న విడుదల చేయగా సినిమా డిసెంబర్ 27న విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
సమానీ సామ్రాజ్యం (పర్షియను: سامانیان, సామానియాను) అనేది 819 నుండి 999 వరకు ఇరానియను 'దెహ్కాను' మూలానికి చెందిన ఒక రాజవంశంచే పాలించబడిన ఒక పర్షియను సున్నీ ముస్లిం సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం ఖొరాసను, ట్రాన్సోక్సియానాలో కేంద్రీకృతమై ఉండేది. దాని ఉచ్ఛస్థితిలో ఈశాన్య ఇరాన్, మధ్య ఆసియా భూభాగాలు కూడా ఇందులో భాగంగా ఉండేవి.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.