The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు.
{{Infobox person | name = శ్రీకాంత్ ఓదెల | image = | birth_name = | birth_date = | birth_place = గోదావరిఖని, [[పెద్దపల్లి] (ప్రస్తుతం తెలంగాణ), భారతదేశం | alma_mater = | occupation = | years_active = 2016–ప్రస్తుతం | known_for = }} శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
మాలపున్నమి లేదా మహలయ పౌర్ణమి పండుగను పల్లె ప్రజలు 'మాల పున్నం' అంటారు. చదువుకొనె వారు మహలయ పౌర్ణమి అంటారు.ఇది రాయలసీమ జిల్లాలలో జరుపుకొనె ఒక పండుగ.ఇది తెలుగునెల ప్రకారం భాద్రాపాద మాసంలో పున్నమి నాడు హరిజనులు చేసుకొనే పండుగ.అంటే ఇంగ్లీషునెల ప్రకారం ఆగష్టు కడపటి వారంలో గాని, సెప్టెంబరు మొదటివారంలో కాని వస్తుంది. మాలపున్నం నగరాలలో అంతగా కనిపించదు.
పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు
పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విజయనగరం నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
హోలీ (సంస్కృతం: होली ) అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా
విరాట్ కోహ్లీ భారతీయ క్రికెటరు . రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటరు. 2023 సెప్టెంబరు నాటికి అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 77 సెంచరీలు చేసాడు — 29 టెస్టు క్రికెట్‌లో, 47 వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డేలు), 1 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ (T20Is)లో 2008 ఆగస్టులో శ్రీలంకపై తన తొలి వన్‌డే ఆడాడు.
వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.
హనుమాన్ అంశ్ అనేది విశాల్ చతుర్వేది తన బ్యానర్ అయిన శంభు మీడియా నెట్‌వర్క్ కథ అందించి, దర్శకత్వం వహించి, నిర్మించిన 2026 భారతీయ హిందీ భాషా చిత్రం. ఒక త్రయం మొదటి విడతగా వచ్చిన ఈ చిత్రం, నీమ్ కరోలి బాబా జీవితం ఇతివృత్తంగా ఆయన రాసిన "డివైన్ డిటోర్ః దట్ చేంజ్డ్ మై లైఫ్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో శోభినవ్ సత్య, చందన్ కె ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించగా, అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా, భగవాన్ దాస్ పటేల్, నేహా పరాంజపే తదితరులు నటించారు.మొదటి చిత్రం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో, దేవుడిని వెతుక్కుంటూ తన తల్లి మరణించిన తరువాత ఇంటి నుండి బయలుదేరిన చిన్న పిల్లవాడు లక్ష్మీ నారాయణ్ ప్రారంభ జీవితాన్ని, ఉత్తర భారతదేశం గుండా అతని తదుపరి ప్రయాణం, నీమ్ కరోలి బాబాగా రూపాంతరం చెందడాన్ని చిత్రీకరించింది.
భారత జీవిత బీమా సంస్థ లేదా లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారత ప్రభుత్వ బీమా, పెట్టుబడి సంస్థ. ఈ సంస్థకు 1956, సెప్టెంబరు 1 న బీమా రంగాన్ని జాతీయం చేయడం కోసం పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు అంకురార్పణ జరిగింది. సుమారు 245 బీమా సంస్థలు, ప్రావిడెంట్ సంస్థలను కలిసి లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గా ఏర్పడింది.
వివేక్ గోయెంకా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటోరియల్ డైరెక్టర్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు ప్రచురించే వార్తాపత్రికలలో ప్రధాన వార్తాపత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, వ్యాపార, ఆర్థిక దినపత్రిక ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, మరాఠీ దినపత్రిక లోకసత్తా, హిందీలో జనసత్తా చెప్పుకోతగ్గవి. ఆన్లైన్లో, ఈ బృందం నేడు దేశంలో మూడవ అతిపెద్ద వార్తా సమూహంగా ఉంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
శుభ్‌మన్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్ టీంతో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శుభ్‌మన్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు.
ప్రీతి ముండే (ఆంగ్లం: Preethi Munde); జననం 2001 మార్చి 18, ఒక భారతీయ మోడల్, యోగా శిక్షకురాలు. తెలంగాణ రాష్రానికి చెందిన ఆమె 2026 సెప్టెంబరు 19న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీలలో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఘనతతో ఆమె 2026 డిసెంబరు 12న ఫిలిప్పీన్స్ లో జరగబోయే అంతర్జాతీయ మిస్ ఎర్త్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అర్హత సాధించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)
లింగాల మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 59 కి. మీ.
జ్ఞానేష్ కుమార్ (జననం 1964 జనవరి 27), 1988 జట్టుకు చెందిన రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి, కేరళ కేడర్ కు చెందిన అతను 26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేస్తున్నారు. అతను 2025 ఫిబ్రవరి 17న ఈ పదవికి నియమితులయ్యారు.గతంలో జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల కమిషనరుగా పనిచేశారు. అలాగే అతను 2024 జనవరి 31న భారత సహకార కార్యదర్శి పదవి నుండి పదవీ విరమణ చేశారు.
మెన్షన్ హౌస్ మల్లేష్ 2026లో విడుదలైన హాస్యభరిత సినిమా. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 12న, ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి, సినిమాను మార్చి 6న విడుదల చేశారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
రాఘవ్ జుయల్ (జననం 10 జూలై 1991) భారతీయ నటుడు, నృత్యకారుడు, కొరియోగ్రాఫర్ & టెలివిజన్ ప్రెజెంటర్. స్లో మోషన్ శైలిలో తన సర్రియల్ డ్యాన్స్ మూవ్‌లకు & భారతదేశంలో స్లో మోషన్ వాక్‌ను తిరిగి ఆవిష్కరించినందుకు అతను "క్రోక్రోక్స్" లేదా "కింగ్ ఆఫ్ స్లో మోషన్" అని ప్రసిద్ధి చెందాడు. జీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ 3లో పోటీదారుగా, ఫైనలిస్ట్‌గా, డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ 2, డాన్స్ కే సూపర్‌కిడ్స్‌లలో రాఘవ్ కే రాక్‌స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తర్వాత గుర్తింపు పెరిగింది, అక్కడ అతని జట్టు అతని కెప్టెన్‌షిప్‌లో విజేతగా ప్రకటించబడింది.
విశ్వనాథ్ అండ్ సన్స్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చ్ 16న, ట్రైలర్‌ను ఆగష్టు 7న విడుదల చేసి, సినిమాను ఆగష్టు 14న విడుదల అయింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
మూస:No image carousel మూస:Redirect-several మూస:TopicTOC-World War II World War II, or the Second World War (1 September 1939 – 2 September 1945), was a global conflict between two coalitions: the Allies and the Axis powers. Nearly all of the world's countries participated, with many engaging in total war on an unprecedented scale. World War II was the deadliest conflict in history, causing the deaths of 60 to 75 million people, a majority of whom were civilians.
ఇజ్రాయెల్‌లో జన్మించిన సూపర్ మోడల్ బార్ రెఫెలీ తన అద్భుతమైన శరీరం, హై-సెన్స్ స్టైల్ స్టేట్‌మెంట్‌ల ద్వారా ఫ్యాషన్ ప్రపంచం దృష్టిని చాలా సులభంగా ఆకర్షించింది. ఆమె ఎనిమిది నెలల పసిపాపగా ప్రకటనలలో కనిపిస్తూ గ్లామర్ ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఇది ప్రారంభం మాత్రమే అయితే, ఆమె యాక్సెసరైజ్, ఎస్కాడా, మార్కో బిసెగో, పాషాటా, సుబారు, ఫాక్స్, చానెల్, గ్యాప్, బాణంతో సహా వివిధ లగ్జరీ ఫ్యాషన్ దిగ్గజాలకు మోడలింగ్ చేయడం ద్వారా ఫ్యాషన్ పరిశ్రమను పాలించింది.
కొమెర అంకారావు, ఇతను ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అడవులు సంరక్షణ, పెంపకం, వృద్ధి కోసం నడుముకట్టి, గత మూడు దశాబ్దాలుగా అలుపెరుగనిపోరాటం చేస్తూ, నల్లమల అడవిలో ప్లాస్టిక్ నిర్మూలన వృక్ష పరిరక్షణ, వన్యప్రాణి రక్షణ చేస్తూ, సమాజాన్ని చైతన్య పరుస్తూ సరికొత్త హరిత అడవులు సృష్టిస్తున్న, భారతీయ పర్యావరణ యోధుడు, పర్యావరణ వేత్త, నల్లమల అడవితల్లి బిడ్డగా గుర్తింపు పొందిన యువకుడు. అంకారావు తండ్రి రాములు, తల్లి ఏడుకొండలు. అంకారావు ముద్దు పేరు జాజి.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.