The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
{{Infobox person | name = శ్రీకాంత్ ఓదెల | image = | birth_name = | birth_date = | birth_place = గోదావరిఖని, [[పెద్దపల్లి] (ప్రస్తుతం తెలంగాణ), భారతదేశం | alma_mater = | occupation = | years_active = 2016–ప్రస్తుతం | known_for = }} శ్రీకాంత్ ఓదెల భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన 2023లో దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఈ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, సైమా అవార్డును గెలుచుకున్నాడు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
దొడ్డకొప్పలు కరియప్ప రవి (10 జూన్ 1979 – 16 మార్చి 2015) 2008 బ్యాచ్‌కి చెందిన కర్ణాటక కేడర్ భారతీయ పరిపాలనా సేవా (ఐ.ఏ.ఎస్) అధికారి. ఈయన కోలార్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న కాలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చట్టవిరుద్ధమైన ఇసుక అక్రమ రవాణాపై అధికారిక చర్యలు చేపట్టి వెలుగులోకి వచ్చారు. పద్నాలుగు నెలల సేవ తర్వాత, 2014 అక్టోబరులో కర్ణాటక ప్రభుత్వం ఈయనను బెంగళూరుకు వాణిజ్య పన్నుల (అమలు) అదనపు కమిషనర్‌గా బదిలీ చేసింది.
అనితా రెడ్డి కర్ణాటకకు చెందిన ఒక భారతీయ సామాజిక కార్యకర్త, అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అండ్ సర్వీసెస్ (ఎవిఎఎస్) వ్యవస్థాపకురాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని మురికివాడల నివాసుల పునరావాసం, అభ్యున్నతికి ఆమె చేసిన సేవలకు ప్రసిద్ధి చెందింది. ద్వారక, డీఆర్ఐకే ఫౌండేషన్లకు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ఆమె పిల్లల విద్య, మహిళల జీవనోపాధి కోసం కృషి చేస్తున్నారు. భారత ప్రభుత్వం 2011లో అనితారెడ్డిని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.
అంబికా ఆనంద్ (జననం: సెప్టెంబరు 15, 1980) ఎన్డిటివిలో భారతీయ టీవీ యాంకర్, ఫ్యాషన్ కన్సల్టెంట్. ఆమె గతంలో ఐస్ ఆన్ స్టైల్, బ్యాండ్ బాజా బ్రైడ్ సీజన్ 7, బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్, ఐ యామ్ టూ సెక్సీ ఫర్ మై షూస్, ఐ యామ్ టూ సెక్సీ - ఆల్ యాక్సెస్ వంటి షోలకు యాంకరింగ్ చేసింది. తన యూట్యూబ్ ఛానల్ లో అంబికా ఆనంద్ షోను హోస్ట్ చేసింది.
పాలమూరు గోస మహబూబ్ నగర్ జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జూలై, 2004 లో వెలువడిన పుస్తకం. పాలమూరు జిల్లాలోని కరువు అంశంపై జిల్లా కవులు తెలుగు, ఉర్దూ భాషలలోరాసిన పాటలు, వచన కవితలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాకు చెందిన చిత్రకారులు కరువు అంశంపై గీసిన చిత్రాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.
జమీల్యా చింగిజ్ ఐత్‌మాతొవ్ రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన నవల . సాంప్రదాయిక బంధనాలు నుండి స్త్రీ స్వేచ్చను కాంక్షిస్తూ రాయబడిన ఈ నవలలో స్త్రీ స్వేచ్చకు ప్రతీకగా జమీల్యా అనే అజరామరమైన పాత్ర సృష్టించబడింది. సంప్రదాయ, పురుషాధిక్య ముస్లిం కిర్గిజ్ సమాజంలో పుట్టిన జమీల్యా మరో పురుషుడికోసం, తన భర్తను విడిచి వెళ్లిపోవడం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం.
ప్రస్తుత రాజ్యసభ సభ్యుల జాబితా
భారతదేశంలో, పార్లమెంటు అనేది భారత రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభల అనే మూడు భాగాలతో కలిగి ఉంది. ఇది రాజ్యసభ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేదిఎగువ సభగా వ్యవహరిస్తారు. భారత పార్లమెంట్ దీనికి రాజ్యసభ కంటే తక్కువ అధికారం కలిగి ఉంది.
గబ్బిలం కవి గుర్రం జాషువా పద్య రచన. ఇందులో జాషువా సామాన్య ప్రజానీకం అశుభంగా భావించే గబ్బిలాన్ని దళిత జనుల అందరి తరపున వారి భాధలను వివరించడానికి శివుడి దగ్గరకు దూతగా పంపిస్తాడు. ఈ గబ్బిలం తమిళనాడులోని తంజావూరు నుంచి, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాలమీదుగా, ఒరిస్సా, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను దాటుకుంటూ కాశీలో ఉన్న శివుడి దగ్గరకు వెళుతుంది.
అర్షద్ వార్సీ (జననం 19 ఏప్రిల్ 1968) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత, నృత్యకారుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, కొరియోగ్రాఫర్, నేపథ్య గాయకుడు. ఆయన 1987లో మహేష్ భట్ దర్శకత్వం వహించిన ''కాష్'' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి 1993లో ''రూప్ కి రాణి చోరోన్ కా రాజా'' సినిమాలో ఒక పాటకు కొరియోగ్రఫీ చేశాడు. వార్సి 1996లో విడుదలైన ''తేరే మేరే సప్నే'' సినిమాతో నటుడిగా అరంగ్రేటం చేశాడు.
అమీరా షా (జననం 24 సెప్టెంబర్ 1979) ఒక భారతీయ పారిశ్రామికవేత్త, ఏడు దేశాలలో ఉనికిని కలిగి ఉన్న ముంబైకి చెందిన పాథాలజీ సెంటర్ల బహుళజాతి గొలుసు అయిన మెట్రోపోలిస్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్. మెట్రోపాలిస్ హెల్త్ కేర్ వ్యవస్థాపకురాలు, చైర్మన్ డాక్టర్ సుశీల్ షా కుమార్తె. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2015 యంగ్ గ్లోబల్ లీడర్ గా ఆమెను సత్కరించింది.
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
ఇన్నర్ రింగు రోడ్డు, హైదరాబాద్
ఇన్నర్ రింగు రోడ్డు, తెలంగాణ రాజధాని హైదరాబాదులో 50 కిలోమీటర్ల సిటీ ఆర్టరీ రోడ్డు. హైదరాబాదు రహదారుల రద్దీని తగ్గించడానికి, ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాలు సులువుగా వెళ్ళడానికి ఈ రోడ్డు నిర్మించబడింది.
హను మాన్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 డిసెంబర్ 19న విడుదల చేసి, సినిమాను జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది.
డాసాల్ట్ రఫేల్ ( ఫ్రెంచ్: [ʁafal] , అక్షరాలా "గాలివాన" అని అర్థం, లేదా మరింత సైనిక అర్థంలో "అగ్నిజ్వాల") అనేది ఫ్రెంచ్ జంట-ఇంజిన్, కానార్డ్ డెల్టా వింగ్, బహుళ పాత్ర యుద్ధ విమానం, దీనిని డసాల్ట్ ఏవియేషన్ రూపొందించి, నిర్మించింది. విస్తృత శ్రేణి ఆయుధాలతో అమర్చబడిన రాఫెల్, వాయు ఆధిపత్యం, నిషేధం, వైమానిక నిఘా, గ్రౌండ్ సపోర్ట్, లోతైన స్ట్రైక్, యాంటీ-షిప్ స్ట్రైక్, అణు నిరోధక కార్యకలాపాలను నిర్వహించడానికి ఉద్దేశించబడింది. దీనిని డసాల్ట్ "ఓమ్నియోల్" విమానం అని పిలుస్తారు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సబీనా రఫీ (అక్టోబరు 6, 1918 - జూన్ 22, 1990) భారతీయ వ్యాసకర్త, మలయాళ సాహిత్య చరిత్రకారిణి. ఆమె రచనల్లో తాత్విక రచనలు, ఆత్మకథ, చవిట్టు నాదకం - ఒక చరిత్ర పదం, చవిట్టు నాదకంపై తొలి చారిత్రక సంకలనం ఉన్నాయి. ఆమె భర్త పొంజిక్కర రఫీతో కలిసి సంయుక్తంగా రచించిన కలియుగం అనే తాత్విక గ్రంథానికి 1972లో కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. చిన్న, ఉపాంత రైతుల (ఎస్ఎంఎఫ్లు) ఆదాయాన్ని పెంపొందించడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో "ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్)" ప్రభుత్వం కొత్త సెంట్రల్ సెక్టార్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి పంట చక్రం చివరలో ఎదురుచూస్తున్న వ్యవసాయ ఆదాయంతో సరైన పంట ఆరోగ్యం, తగిన దిగుబడులను నిర్ధారించడానికి వివిధ రకాల ఇన్పుట్లను సేకరించేందుకు SMFs ఆర్థిక అవసరాలకు అనుగుణంగా PM-KISAN పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
సేషెల్స్ ), అధికారికంగా " సేషెల్స్ రిపబ్లిక్ " హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపసమూహ దేశం. 115 ద్వీపాల దేశం రాజధాని విక్టోరియా, తూర్పు ఆఫ్రికాకు తూర్పున 1,500 కిలోమీటర్ల (932 మైళ్ళు) దూరంలో ఉంది. ఇతర సమీపంలోని ద్వీప దేశాలు, భూభాగాలు కొమొరోస్, మయొట్టె (ఫ్రాన్స్ ప్రాంతం), మడగాస్కర్, రీయూనియన్ (ఫ్రాన్సు ప్రాంతం), దక్షిణసరిహద్దులో మారిషస్, అలాగే తూర్పు సరిహద్దులో మాల్దీవులు, బ్రిటీషు హిందూ మహాసముద్రం ఉన్నాయి.
బద్రుద్దీన్ అజ్మల్ (జననం 12 ఫిబ్రవరి 1950) అసోం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ కుటుంబ సభ్యులతో కలిసి అజ్మల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను కలిగి ఉన్నాడు, వీటిలో అజ్మల్ ఫ్రాగ్రాన్సెస్ అండ్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అజ్మల్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెల్లెజా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, హ్యాపీ నెస్ట్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-మాజిద్ డిస్టిలేషన్ అండ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ & అజ్మల్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.
రోమ్(English: Rome; Italian: Roma రోమా) ఇటలీ దేశపు రాజధాని, ప్రాంతీయనామం లాజియో, ఇది ఇటలీలోనే పెద్ద నగరం, జనాభా 27,05,317, అర్బన్ ప్రాంత విస్తీర్ణంలోని జనాభా 34,57,690 మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 40 లక్షలు. దీని విస్తీర్ణం 5,352 చ.కి.మీ. ఈ నగరం ఇటలీ ద్వీపకల్పము నకు పశ్చిమ-దక్షిణ భాగాన, on the టైబర్ నది ఒడ్డున గలదు.
డార్లింగ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 8న విడుదల చేసి సినిమాను జూలై 19న విడుదల చేశారు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనరు, అనే పదవి స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగబద్ధంగా అధికారం కలిగిన భారత ఎన్నికల కమిషన్ (సిఇసి)కి నాయకత్వం వహించే ప్రధాన ఎన్నికల కమిషనరు (సిఇసి). భారత ప్రధాన మంత్రి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి ఒక ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తారు. అత్యంత సీనియర్ ఎన్నికల కమిషనర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తారు.
నిక్ వాలెండా (జననం: 1979 జనవరి 24) ఒక అమెరికన్ ఆక్రోబాట్, ఏరియలిస్ట్, డేర్డెవిల్, హై-వైర్ కళాకారుడు, రచయిత. ఇతను భద్రతా వలయం లేకుండా తన హై-వైర్ ప్రదర్శనల ద్వారా ప్రసిద్ధి చెందాడు. ఇతను తొమ్మిది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కలిగి ఉన్నాడు, ముఖ్యంగా 2012 జూన్ 15 న నయాగరా జలపాతంపై నేరుగా కట్టబడిన టైట్‌రోప్‌పై నడిచిన మొదటి వ్యక్తి, అయితే చట్టం సూచించిన మేరకు భద్రత కొరకు జాగ్రతలు తీసుకున్నాడు.
మాలపున్నమి లేదా మహలయ పౌర్ణమి పండుగను పల్లె ప్రజలు 'మాల పున్నం' అంటారు. చదువుకొనె వారు మహలయ పౌర్ణమి అంటారు.ఇది రాయలసీమ జిల్లాలలో జరుపుకొనె ఒక పండుగ.ఇది తెలుగునెల ప్రకారం భాద్రాపాద మాసంలో పున్నమి నాడు హరిజనులు చేసుకొనే పండుగ.అంటే ఇంగ్లీషునెల ప్రకారం ఆగష్టు కడపటి వారంలో గాని, సెప్టెంబరు మొదటివారంలో కాని వస్తుంది. మాలపున్నం నగరాలలో అంతగా కనిపించదు.
మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మంగ్లీని తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి (ఎస్‌వీబీసీ) ఛానల్ సలహాదారుగా 2022 నవంబర్ లో ఏపీ ప్రభుత్వం నియమించింది.
లాల్‌జీ సింగ్ (5 జూలై 1947 – 10 డిసెంబర్ 2017) భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన భారతదేశంలో డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ సాంకేతికత అభివృద్ధికి చేసిన కృషి వల్ల "భారతీయ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ తండ్రి"గా ప్రసిద్ధి చెందారు. ఆయన సహాయక ప్రజనన సాంకేతికత, లింగ నిర్ధారణ వ్యవస్థ యొక్క అణు స్థాయి ఆధారం, వన్యప్రాణి సంరక్షణ ఫోరెన్సిక్ పరిశోధనలు, మానవుల పరిణామం, వలసలు వంటి రంగాల్లో కూడా పరిశోధనలు చేశారు.
దితి, కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఒక సారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుని పోయి సముద్రగర్భంలో దాచి పెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహా విష్ణువు వరాహ అవతారాన్ని ధరించి, వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు...ఆ సమయములో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు.ఆ పుత్రుని చూసి, నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసురలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు.ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసదించమని వరము కోరుతుంది.దానికి విష్ణుమూర్తి సరే అని, తన తల్లి చేతుల్లలోనే ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు.ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భుదేవి ఎంతో సంతోషిస్తుంది.తర్వాత నరకుడిని జనకమహరజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది.ఆ విధముగా జనకమహరజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.