The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
సింధు నదీజలాల ఒప్పందం అన్నది ప్రపంచ బ్యాంకు (అప్పట్లో అంతర్జాతీయ అభివృద్ధి, పునర్నిర్మాణ బ్యాంకు) మధ్యవర్తిత్వంతో భారతదేశం, పాకిస్తాన్ ల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీ ఒప్పందం. ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు మూడు - బియాస్, రావి, సట్లెజ్ లపై భారతదేశానికి, మూడు పశ్చిమ నదులు - సింధు, చీనాబ్, ఝీలంలపై పాకిస్తాన్‌కూ నియంత్రణ ఉంటుంది.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
తాండూర్, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లా, తాండూరు మండలానికి చెందిన గ్రామం. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఇది హైదరాబాదుకు పశ్చిమాన 116 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా పశ్చిమాన ఈ పట్టణం ఉంది.వికారాబాదు జిల్లాలో పశ్చిమాన ఉన్న ఈ పట్టణం వ్యవసాయపరంగా కందులకు, పారిశ్రామికపరంగా నాపరాళ్ళకు ప్రసిద్ధి.మూడవ గ్రేడు పురపాలకసంఘంచే పట్టణ పాలన నిర్వహించబడుతుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
22 ఏప్రిల్ 2025న భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ పచ్చిక మైదానంలో, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు హిందూ పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు, కనీసం 28 మంది మరణించాగా 20 మందికి పైగా గాయపడ్డారు. 2019 పుల్వామా బాంబు దాడి తరువాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రాణాంతకమైన ఈ దాడి, పౌరులను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్ లోయలో జనాభా మార్పులను నిరోధించడమే లక్ష్యంగా జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో పర్యాటకులు, అధికారులతో సహా కనీసం 28 మంది మరణించారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2000-2009)
పద్మశ్రీ పురస్కారం, భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం - 2000 - 2009 సంవత్సరాల మధ్య విజేతలు:
బారాముల్లా (బెర్మాలా అని ఉచ్ఛరిస్తారు) అనేది భారత కేంద్ర పాలితప్రాంత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఒక నగరం, పురపాలక సంఘం.ఇది జీలం నది ఒడ్డున రాష్ట్ర రాజధాని శ్రీనగర్ దిగువన ఉంది.ఈ నగరాన్ని పూర్వం వరాహముల' అని పిలిచేవారు.ఈ పేరు రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది, వరాహ (పంది అని అర్ధం), మాలా (మూలం అని అర్ధం).ఈ నగరం జీలంనది ఒడ్డున,ఎత్తైన ప్రదేశంలో ఉంది.జీలంనది ఈనగర శివార్లలోనే డెల్టాను ఏర్పరుస్తుంది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
హైడ్రాజీన్ అనునది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.వ్యవస్థపరమైన పేరు డైఆజాన్ లేదా టెట్రాహైడ్రిడో డైనైట్రోజన్ (N-N). ఈ సంయోగపదార్థం యొక్క రసాయనసంకేత పదం H2NNH2 (N2H4అనికూడా వ్రాస్తారు).ఇది రంగులేని మండేలక్షణము ఉన్న ద్రవం.అమ్మోనియా వాయువు వంటి వాసన కలిగిఉన్నది. హైడ్రాజీన్ అధిక విష ప్రభావమున్న రసాయనపదార్థం, హైడ్రాజీన్ స్థిరమైనది, కావున ద్రవరూపంలో జాగ్రత్తగా భద్రపరచవలెను.
జమ్మూ కాశ్మీరు (Jammu and Kashmir), /dʒəmmuː ənd kəʃmiːr/, కాశ్మీరీ:ज्वम त॒ कॅशीर, హిందీ:जम्मू और कश्मीर, ఉర్దూ:جموں و کشمیر) భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రముంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
నేదురుమల్లి రాజ్యలక్ష్మి(Nedurumalli Rajya Lakshmi) 1942, జూలై 15న నెల్లూరు లో జన్మించారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనేది రామ్ జగదీష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 2025 భారతీయ తెలుగు భాషా లీగల్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు. నటుడు నాని నిర్మించిన ఈ చిత్రంలో కథానాయిక శ్రీదేవి, కాకినాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూనే నటించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.
కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
ఇప్పలపల్లి (మహబూబ్ నగర్ గ్రామీణ మండలం)
ఇప్పలపల్లి,తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ (గ్రామీణ) మండలంలోని గ్రామం. ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి 12 కి. మీ.
సారంగపాణి జాతకం 2024లో విడుదలైన సినిమా. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేశ్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 21న నటుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయగా, డిసెంబరు 20న విడుదల కావాల్సివుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
భారత పాకిస్తాన్ యుద్ధాలు, ఘర్షణలు
1947 లో దేశ విభజన తరువాత భారతదేశం, పాకిస్తాన్ల మధ్య అనేక యుద్ధాలు ఘర్షణలూ జరిగాయి. 1971 యుద్ధాన్ని మినహాయించి మిగిలిన ప్రధాన ఘర్షణలన్నిటికీ కాశ్మీర్ సమస్య, సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదమే ప్రధాన కారణాలు. 1971 యుద్ధం ఆనాటి తూర్పు పాకిస్తాన్‌ను (ప్రస్తుత బంగ్లాదేశ్) విముక్తి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నం వల్ల జరిగింది.