The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (నెల్లూరు జిల్లా, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా), భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా కేంద్రం నెల్లూరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఈ జిల్లాలోని కొంత భూభాగం తిరుపతి జిల్లాలో చేరగా, గతంలో ప్రకాశం జిల్లాలో చేరిన భాగాలను తిరిగి ఈ జిల్లాలో కలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 140 కి చేరింది. 'గ్రూప్ ఏలో 54', 'గ్రూప్ బిలో 28', 'గ్రూప్ సిలో 1', 'గ్రూప్ డిలో 47', గ్రూప్ ఇలో 14 కులాలున్నాయి. వెనుకబడిన కులాలకు మొత్తం ఉన్న 25% రిజర్వేషన్లలో గ్రూపు-ఏకు 7శాతం, గ్రూ పు-బీకి 10 శాతం, గ్రూపు-సీకి 1శాతం, గ్రూపు-డీకి 7శాతం రిజర్వేషన్లుంటాయి..
చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.చందమామను బి.నాగిరెడ్డి - చక్రపాణి (వీరు తెలుగు, తమిళ భాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) 1947 జూలైలో ప్రారంభించారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
సింధు నదీజలాల ఒప్పందం అన్నది ప్రపంచ బ్యాంకు (అప్పట్లో అంతర్జాతీయ అభివృద్ధి, పునర్నిర్మాణ బ్యాంకు) మధ్యవర్తిత్వంతో భారతదేశం, పాకిస్తాన్ ల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీ ఒప్పందం. ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు మూడు - బియాస్, రావి, సట్లెజ్ లపై భారతదేశానికి, మూడు పశ్చిమ నదులు - సింధు, చీనాబ్, ఝీలంలపై పాకిస్తాన్‌కూ నియంత్రణ ఉంటుంది.
నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలానికి ఇది కేంద్రం. పిన్ కోడ్: 518501. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక పెద్ద వాణిజ్య కేంద్రం.2011 జనాభా లెక్కల ప్రకారం నంద్యాల నగరం 211,424 జనాభా కలిగి ఉంది.2022 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో నంద్యాల కూడా ఒకటి.మునుపటి కర్నూలు జిల్లా నుండి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.నంద్యాల రాయలసీమలోలో ఐదవ అతిపెద్ద నగరం.ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి శ్రీశైలం డ్యామ్ నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి.పి.వి.నరసింహారావు నంద్యాల నియోజకవర్గం నుండి లోక్‌సభకు అత్యంత భారీ మెజారిటీ వోట్లతో ఎన్నికై ప్రపంచ రికార్డు సృష్టించాడు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
చేపలు లేదా మత్స్యాలు మంచినీటిలో, ఉప్పునీటిలో జీవిస్తూ 25,000 జాతులు ఉన్నాయి.చేపలను వాటి శ్వాసా అవయవాల అమరికను బట్టి" 1.ఊపిరితిత్తుల చేపలు,2.మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించ వచ్చును.చేపల ఆహారపు అలవాటును బట్టి 1.సర్వభక్షకచేపలు, 2.శాకాహారపు చేపలు, 3.మాంసాహారపు (స్వజాతి భక్షక) చేపలు అని గుర్తించ వచ్చును.అదే విధముగా అవి నివసించే అలవాటును అనుసరించి1. మంచినీటిచేపలు 2.ఉప్పునీటి చేపలు అనిచెప్పవచ్చును.చేపలు మానవఆహారముగా అత్యధిక ప్రాధాన్యతను కలిగిఉన్నాయి.అత్యధికచిన్న చేప 0.25 సెంటి.మీ.ఉంటే పెద్దచేప 2మీ.కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.డయోడాన్ అనే చేపఅత్యంత విష పూరిత మైనది.ఇది సముద్రజలాలలోనే నివసిస్తుంది.చేపలన్నీ మానవఆహారముగా వినియోగమవుతున్నాయి.చేపలను 1.ఆనందానికి, ఆహ్లాదకరానికి గాజు తోట్టెలలో పెంచు పద్ధతిని 2.ఆహారానికై చెరువులలో పెంపకము చేయు పద్ధతిని, 3.సముద్రము, నదులు.కాలువలలో పంజారాలలో (cage culture) పెంచు పద్ధతులను శాస్త్రీయ, సాంకేతికపరిజ్ఞానముతో పెంపొందించారు.
బారాముల్లా (బెర్మాలా అని ఉచ్ఛరిస్తారు) అనేది భారత కేంద్ర పాలితప్రాంత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఒక నగరం, పురపాలక సంఘం.ఇది జీలం నది ఒడ్డున రాష్ట్ర రాజధాని శ్రీనగర్ దిగువన ఉంది.ఈ నగరాన్ని పూర్వం వరాహముల' అని పిలిచేవారు.ఈ పేరు రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది, వరాహ (పంది అని అర్ధం), మాలా (మూలం అని అర్ధం).ఈ నగరం జీలంనది ఒడ్డున,ఎత్తైన ప్రదేశంలో ఉంది.జీలంనది ఈనగర శివార్లలోనే డెల్టాను ఏర్పరుస్తుంది.
రాహుల్ గాంధీ (జననం 1970 జూన్ 19) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్ లకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ (సంభాజీరాజే భోసలే) (1657–1690) మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు. ఆయన రాజుగానే కాకుండా, యోధుడు, పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా.అతను తన జీవితకాలంలో 120 యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రాయల్ నార్వేజియన్ నేవీ (నార్వేజియన్: జొఫర్స్వారెట్, అక్షరాలా 'సముద్ర రక్షణ') అనేది నార్వేజియను కోస్టు గార్డుతో సహా నార్వే నావికా కార్యకలాపాలకు బాధ్యత వహించే నార్వేజియను సాయుధ దళాలశాఖ. 2008 నాటికి రాయలు నార్వేజియను నేవీలో సుమారు 3,700 మంది సిబ్బంది (సమీకరించబడిన స్థితిలో 9,450, పూర్తిగా సమీకరించబడినప్పుడు 32,000), 4 భారీ యుద్ధనౌకలు, 6 జలాంతర్గాములు, 14 పెట్రోలు పడవలు, 4 మైను స్వీపర్లు, 4 మైను హంటర్లు, 1 మైను డిటెక్షను నౌక, 4 సపోర్టు నౌకలు, 2 శిక్షణ నౌకలు సహా 70 నౌకలు ఉన్నాయి. ఈ నౌకాదళానికి 955 నాటి చరిత్ర ఉంది.
22 ఏప్రిల్ 2025న భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని బైసరన్ పచ్చిక మైదానంలో, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు హిందూ పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు, కనీసం 28 మంది మరణించాగా 20 మందికి పైగా గాయపడ్డారు. 2019 పుల్వామా బాంబు దాడి తరువాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రాణాంతకమైన ఈ దాడి, పౌరులను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్ లోయలో జనాభా మార్పులను నిరోధించడమే లక్ష్యంగా జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో పర్యాటకులు, అధికారులతో సహా కనీసం 28 మంది మరణించారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు.
ఈ క్రింద సూచించినవి భారతీయ రైల్వేలు నడుపు రైళ్లు జాబితా. అస్సాం మెయిల్ – స్వాతంత్ర్యానికి పూర్వం రోజుల నుండి ఇది ఉందని, భారత రైల్వే వ్యవస్థలోని బ్రాడ్ గేజ్ మార్గము రైళ్లు ఒక విస్తార స్థాయిలో 1980 సం.లలో ఆవిష్కరణతో మంచి ప్రజాదరణ పొందిన మీటర్ గేజ్ రైళ్ళలో ఇది ఒకటి, దీనికి ఒక ప్రత్యేకతను కూడా సముపార్జించుకుంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ - హైదరాబాదు, కోల్‌కతా సమీపంలోని హౌరా మధ్య నడుస్తున్న రోజువారీ రైలు.