The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
రాజమహేంద్రవరం (రాజమండ్రి, రాజమహేంద్రి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం, జిల్లా కేంద్రం. ఈ నగరం తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని రాజధాని. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది.
కదిరి వెంకటరెడ్డి (1912 జూలై 1- 1972 సెప్టెంబరు 15) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే.
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
చూడండి తెలుగు సాహిత్య విభాగాలు, రచయితల జాబితా కొందరు సాహితీకారులు బహుముఖ ప్రజ్ఞాశాలురు (ఉదాహరణ: కందుకూరి వీరేశలింగం, విశ్వనాధ సత్యనారాయణ). అనేక రంగాలలో ఖ్యాతి వహించినవారు. అటువంటివారి పేర్లను కేవలం వర్గీకరణ కోసం ఈ క్రింద ఏదో ఒక ప్రధాన శీర్షికలో చేర్చవచ్చును.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (ఏ.పి.యస్.ఆర్.టి.సి (APSRTC) ) ప్రభుత్వ రంగంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ. రాష్ట్రంలోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరాలలో సిటీ బస్సు సేవలను, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్ఘడ్, గోవా లకు బస్సులు నడుపుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 దేశవాలీ టీ-20 లీగ్, ఈ టోర్నీ 2022 మార్చి 31 నుండి మే 29 వరకు జరిగింది. ఐపీఎల్ 16వ సీజన్ లో తొలి మ్యాచ్ మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఐపీఎల్ మ్యాచ్‌లు లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు మార్చి 31న నుండి మే 21 వరకు మొత్తం 12 వేదికల్లో జరిగాయి.
భర్త పట్ల క్రౌర్యం అనగా స్త్రీల రక్షణ కొరకు ఉన్న చట్టాలను తనకనుకూలంగా ఉపయోగించుకొని భర్త, అయన కుటుంబీకులు ప్రమేయం లేనప్పటికిని దుర్వినియోగం చేస్తూ, డబ్బు కోసం వేధిస్తూ భయపెట్టడం. కొన్ని సందర్భాలలో శారీరకంగానూ, మాససికంగానూ, సామాజికం గానూ భర్తను వేధించటం. చట్టం స్త్రీలకే అనుకూలంగా ఉన్నది అనే భ్రమ నెలకొని ఉండటం మూలాన భార్య/ఆమె కుటుంబీకులు/ఆమె బంధుమిత్రులు తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరించటం, వాటికి కట్టుకొన్న భర్త ఒప్పుకోని పక్షంలో స్త్రీ సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలనే అమాయక భర్త పై అస్త్రాలుగా ప్రయోగించటం/లేదా ప్రయోగిస్తామని బెదిరించటమే "భర్త పట్ల క్రౌర్యం".
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 140 కి చేరింది. 'గ్రూప్ ఏలో 54', 'గ్రూప్ బిలో 28', 'గ్రూప్ సిలో 1', 'గ్రూప్ డిలో 47', గ్రూప్ ఇలో 14 కులాలున్నాయి. వెనుకబడిన కులాలకు మొత్తం ఉన్న 25% రిజర్వేషన్లలో గ్రూపు-ఏకు 7శాతం, గ్రూ పు-బీకి 10 శాతం, గ్రూపు-సీకి 1శాతం, గ్రూపు-డీకి 7శాతం రిజర్వేషన్లుంటాయి..
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతంలోని డెల్టాగన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహాఇల్లాలు. 'అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
కోటప్పకొండ, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అది నేత ఇంద్ర దేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ.
సింధు నదీజలాల ఒప్పందం అన్నది ప్రపంచ బ్యాంకు (అప్పట్లో అంతర్జాతీయ అభివృద్ధి, పునర్నిర్మాణ బ్యాంకు) మధ్యవర్తిత్వంతో భారతదేశం, పాకిస్తాన్ ల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీ ఒప్పందం. ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు మూడు - బియాస్, రావి, సట్లెజ్ లపై భారతదేశానికి, మూడు పశ్చిమ నదులు - సింధు, చీనాబ్, ఝీలంలపై పాకిస్తాన్‌కూ నియంత్రణ ఉంటుంది.
20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలి
భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభా (population) అన్న పదాన్ని ఒక జాతికి (species) చెందిన జీవుల సంఖ్యను చెప్పడానికి వాడుతారు. పాపులేషన్ అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్థంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్థంలో జనాభా అన్న పదం వాడబడింది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
కార్తికేయ గుమ్మకొండ, దక్షిణాది చిత్రాలతో పేరొందిన నటుడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్ 100 తో తన మొదటి విజయం సాధించడమే కాక తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. హీరో నాని నటించిన నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా నటించడమే కాక, గుణ 369, 90ఎంఎల్ చిత్రాల ద్వారా కమర్షియల్ హీరోగా కూడా మంచి విజయాలు సాధించాడు.
కర్ణాటక రాష్ట్రంలో 2018 మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 224 స్థానాలకు జరగవలసిన ఎన్నికలలో 222 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఈ ఎన్నికలు జరిగాయి. మిగిలిన రెండు స్థానాలైన విజయనగర శాసనసభ నియోజకవర్గంలో ఎం.ఎల్.ఎ మరణం వల్ల, రాజరాజేశ్వరి నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల మోసం అభియోగం వల్ల ఎన్నికలు వాయిదా వేసారు.
గోవా జానపద నృత్యాలు వేల సంవత్సరాల సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి, గోవా సమాజంలోని వివిధ వర్గాల, మతాలు, కులాల జీవనశైలి, సంస్కృతులు, ఆకాంక్షలను ప్రతిబింబించే అసంఖ్యాక నృత్య రూపాలు గోవాలో ప్రదర్శించబడతాయి.సాంప్రదాయ, ఆధునిక సంగీతం యొక్క అరుదైన సమ్మేళనం అయిన డెక్ని వంటి అనేక సాంప్రదాయ నృత్యాలను మహిళలు ప్రదర్శిస్తారు. ఫుగ్డి, ధాలో గోవాలో తరచుగా ప్రదర్శింపబడె అత్యంత సాధారణ జానపద నృత్యాలు.కుంబీ ఒక గిరిజన జానపద నృత్యం. షిగ్మో పండుగ సందర్భంగా తలపై దీపాలు పట్టుకుని దీప నృత్యం చేస్తారు .షిగ్మో సమయంలో వెనుకబడి న సామాజిక వర్గం ప్రదర్శించే మరొక సాంప్రదాయ జానపద నృత్యం మోరులెం.జాగోర్ అనేది గోవాలోని వివిధ గ్రామాలలోగౌడ సామాజికవర్గం ]ప్రదర్శించే జానపద నాటకం.నవరాత్రి సమయంలో అత్యంత ఆకర్షణీయమైన ధంగర్ ఆరాధన, నృత్యం ఆ సమావేశ కాలం ]లో ఎంతో ఉత్సాహంతో ప్రదర్శింపబడుతుంది.మండో అనేది భారతీయ, పాశ్చాత్య సంప్రదాయాల కలయికను సూచించే ప్రేమ పాట.
పెరూ (ఆంగ్లం Perú), ( స్పానిష్ : పెరూ ; క్వెచువా : పెరు లేదా Piruw ; ( ఐమారా : పిర్యూ) అధికారికంగా పెరూ రిపబ్లిక్ ( స్పానిష్ : రిపబ్లికా డెల్ పెరూ ") దక్షిణ అమెరికా వాయువ్యభాగంలో ఉన్న ఒక దేశం. పెరూ దక్షిణ సరిహద్దులో చిలీ, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం, ఆగ్నేయ సరిహద్దులో బొలీవియా, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, ఉత్తర సరిహద్దులో ఈక్వడార్, కొలంబియా దేశాలు ఉన్నాయి. పెరూ వైవిధ్యమైన భౌగోళికస్థితి, పర్యావరణం కలిగి ఉంటుంది.