The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
ఇథియోపియా అధికారిక నామం "ఇథియోపియా బహుకేంద్రక ప్రజాస్వామ్య గణతంత్రం" ఒక భూపరివేష్టిత దేశం,ఆఫ్రికా ఖండంలో ఈశాన్యంలో ఉంది. దీని ఉత్తరసరిహద్దులో ఎరిత్రియా, పశ్చిమసరిహద్దులో సూడాన్, దక్షిణసరిహద్దులో కెన్యా, తూర్పుసరిహద్దులో సోమాలియా, ఈశాన్యసరిహద్దులో జిబౌటి దేశాలు ఉన్నాయి. దేశవైశాల్యం 11,00,000 చ.కి.మీ.
తజికిస్తాన్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్ (ఆంగ్లం : Tajikistan) (తజక్ భాష : Тоҷикистон), (పర్షియన్ : تاجیکی ) పూర్వపు తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, మధ్య ఆసియాలోని ఒక దేశము. దీనికి ఆఫ్ఘానిస్తాన్, చైనా, కిర్గిజ్ స్తాన్,, ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దులు ఉన్నాయి. దక్షిణంలో ఉన్న పాకిస్థాన్‌ను వాఖన్ కారిడార్ వేరు చేస్తుంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
వైభవ్ సూర్యవంశీ (జననం 27 మార్చి 2011) బీహార్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్. ఆయన 2024లో 12 సంవత్సరాల వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సంవత్సరం తరువాత 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్‌లో చేరి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్టుపై సంతకం చేసి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు, లిస్ట్ ఆ క్రికెట్లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2020-2029)
పద్మశ్రీ పురస్కారం, భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం. 2020 - 2029 సంవత్సరాల మధ్య విజేతల వివరాలు ఇందులో నమోదు కాబడతాయి.
చేపలు లేదా మత్స్యాలు మంచినీటిలో, ఉప్పునీటిలో జీవిస్తూ 25,000 జాతులు ఉన్నాయి.చేపలను వాటి శ్వాసా అవయవాల అమరికను బట్టి" 1.ఊపిరితిత్తుల చేపలు,2.మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించ వచ్చును.చేపల ఆహారపు అలవాటును బట్టి 1.సర్వభక్షకచేపలు, 2.శాకాహారపు చేపలు, 3.మాంసాహారపు (స్వజాతి భక్షక) చేపలు అని గుర్తించ వచ్చును.అదే విధముగా అవి నివసించే అలవాటును అనుసరించి1. మంచినీటిచేపలు 2.ఉప్పునీటి చేపలు అనిచెప్పవచ్చును.చేపలు మానవఆహారముగా అత్యధిక ప్రాధాన్యతను కలిగిఉన్నాయి.అత్యధికచిన్న చేప 0.25 సెంటి.మీ.ఉంటే పెద్దచేప 2మీ.కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.డయోడాన్ అనే చేపఅత్యంత విష పూరిత మైనది.ఇది సముద్రజలాలలోనే నివసిస్తుంది.చేపలన్నీ మానవఆహారముగా వినియోగమవుతున్నాయి.చేపలను 1.ఆనందానికి, ఆహ్లాదకరానికి గాజు తోట్టెలలో పెంచు పద్ధతిని 2.ఆహారానికై చెరువులలో పెంపకము చేయు పద్ధతిని, 3.సముద్రము, నదులు.కాలువలలో పంజారాలలో (cage culture) పెంచు పద్ధతులను శాస్త్రీయ, సాంకేతికపరిజ్ఞానముతో పెంపొందించారు.
భారతదేశం లోని హిందూమత యాత్రాస్థలాల జాబితా
మతం, ఆధ్యాత్మికతలో, ఒక తీర్థయాత్ర గొప్ప నైతిక ప్రాముఖ్యత, ఇది ఒక పవిత్ర ప్రదేశం లేదా ఒక ప్రయాణం నమ్మకం, విశ్వాసం యొక్క ప్రాముఖ్యతతో కూడినది. ప్రతి ప్రధాన మతం లోని సభ్యులు విశ్వాసం కలిగిన ప్రజలు యాత్రికులుగా యాత్రలలో పాల్గొంటారు. ప్రతి పవిత్ర స్థలాలకు యాత్రకు దాని స్వంత మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఇద్దరు తండ్రి కొడుకులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసిన వారే.
ఫాస్పారిక్ ఆమ్లం ఒక అకర్బన, ఖనిజ ఆమ్లం.దీనిని అర్థోఫాస్పారిక్ ఆమ్లం లేదా ఫాస్పారిక్ (V) ఆమ్లం అనికూడా అంటారు.ఫాస్పారిక్ ఆమ్లం రసాయన ఫార్ములా H3PO4. ఫాస్పర్ (భాస్వర౦) హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన ఈ ఆమ్లం ఏర్పడినది. అర్థోఫాస్పారిక్ ఆమ్లం అనుపేరు ఈ ఆమ్లం యొక్క శాస్త్ర నామం (IUPAC name).అర్థో అను ముందుపదం, ఈ ఆమ్లాన్ని మిగతా పాలిఫాస్పారిక్ ఆమ్లాలకన్న వేరుగా గుర్తించుటకు పెట్టారు.
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
జూలై (July) నెల, జూలియన్,గ్రెగోరియన్ క్యాలెండర్లు ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఏడవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.పురాతన రోమన్ క్యాలెండర్లో ఐదవ నెల కావడంతో జూలై నెలను గతంలో లాటిన్లో "క్విన్టిలిస్" అని పిలిచేవారు. జూలియన్ క్యాలెండర్ సంస్కరణ సందర్భంగా జూలియస్ సీజర్ గౌరవార్థం నెల పేరు జూలైగా మార్చబడింది.
అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నమీబియా అని పిలవబడే నమీబియా ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. దీని పశ్చిమ సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో అంగోలా - జాంబియా దేశాలు ఉన్నాయి, తూర్పుసరిహద్దులో బోత్సువానా - జింబాబ్వే దేశాలు ఉన్నాయి, దక్షిణ - తూర్పుసరిహద్దులను దక్షిణ ఆఫ్రికాతో పంచుకుంటుంది. ఇది నమీబియా స్వతంత్ర పోరాటం తర్వాత 1990 మార్చి 21న దక్షిణ ఆఫ్రికా నుండి స్వాతంత్ర్యాన్ని పొందింది.
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అహింసాత్మకంగా సమావేశం నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వీరులపై బ్రిటిషు వారు జరిపిన ఊచకోత. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13 న బ్రిటిషు సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
సెప్టెంబరు (September), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో తొమ్మిదవ నెల. ఈ నెలలో 30 రోజులు ఉన్నాయి.రోమన్ క్యాలెండరు ప్రకారం అసలు సంవత్సరంలో సెప్టెంబరు ఏడవ నెలగా ఉండేది.దానిపేరు ఇక్కడే నిర్ణయించబడింది.తరువాత క్యాలెండరుకు జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చినప్పుడు ఇది తొమ్మిదవ నెలగా మారింది.బ్రిటిష్ వారు 1752 లో జూలియన్ క్యాలెండరు నుండి గ్రెగోరియన్ క్యాలెండరుకు మారినప్పుడు, నెలలతో సీజన్లను సమలేఖనం చేయడానికి వారు కొన్ని రోజులు సర్దుబాటు చేసారు.సెప్టెంబరు నెల నుండి నేరుగా సెప్టెంబర్ 3 నుండి 14 వరకు 11 రోజులు తీసుకున్నారు.1752 లో సెప్టెంబర్ 3, 13 మధ్య రోజులు బ్రిటిష్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు.
28 డిగ్రీల సెల్సియస్ 2025లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించిన ఈ సినిమాకు డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి, ప్రియదర్శి, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2019 ఏప్రిల్ 27న, ట్రైలర్‌ను మార్చి 24న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 04న విడుదల చేశారు.
ఆహారం (Food) జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి.
బెలారస్ లేదా బెలారుస్ (ఆంగ్లం:Belarus) (పాతపేరు: బైలో రష్యా, లేదా బెలో రష్యా) తూర్పు యూరప్‌లో ఉన్న ఒక భూపరివేష్టిత దేశం, దీని ఉత్తరసరిహద్దు మరియ్ తూర్పుసరిహద్దులలో రష్యా, దక్షిణసరిహద్దులో ఉక్రెయిన్, పశ్చిమసరిహద్దులో పోలాండ్, ఉత్తరసరిహద్దులో లిథువేనియా, లాత్వియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నగరం, అత్యధిక జనసాంధ్రత కలిగిన దేశం మిన్స్క్ నగరం.దేశంలో 40% భూభాగంలో అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. 20 వ శతాబ్దం వరకు వివిధ సమయాల్లో వివిధ రాజ్యాలు ఆధునిక కాలపు బెలారస్ భూభాగాలను నియంత్రించాయి.
బలి అనగా దైవప్రీతి కోసం ఏదో ఒక జీవాన్ని చంపే ఒక క్రతువు. హిందూ మతంలో జంతు బలి ఆచారం ఎక్కువగా వేద శ్రౌత ఆచారాలు, స్థానిక గిరిజన సంప్రదాయాలలో బలంగా పాతుకుపోయిన హిందూ జానపద ఆచారాలతో ముడిపడి ఉంది, అయినప్పటికీ జంతు బలులు భారతదేశంలోని పురాతన వైదిక మతంలో భాగంగా ఉన్నాయి. వీటి గురించి యజుర్వేదం వంటి గ్రంథాలలో ప్రస్తావనలు ఉన్నాయి.