The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30 - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనలలో ఒకటి.
కొండ బసవ రాజులు గా పిలవబడే ఈ కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.వీరు తెలుగు మాతృభాషగా కలిగియున్న వీరు హిందూ మతాన్ని ఆచరించారు.నేడు ఆంధ్ర ప్రాంతంలోని కృష్టా, ఉభయ గోదావరి జిల్లాలలోను, విశాఖ,విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు.ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు ఓసి విభాగానికి చెందుతారు. కర్నాటక రాష్ట్రంలో బీసీ విభాగానికి చెందుతారు.వీరు స్థానికంగా భూస్వామ్య కులంగా పిలుస్తారు.బ్రిటీష్ పాలన వీరు చిత్తు వసూల్ చేసేవారు .ఆంధ్ర ప్రాంతంలో అసలు సూర్య వంశ రాజు క్షత్రియ వర్ణం లేనప్పటికీ వర్ణ వ్యవస్థలో క్షత్రియ హోదాలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నారు.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693), భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
బసవ జయంతి / బసవేశ్వర జయంతి అనేది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని లింగాయత్ లు సాంప్రదాయకంగా జరుపుకునే ఉత్సవం. ఇది 12వ శతాబ్దపు కవి, తత్వవేత్త, లింగాయత్ సంప్రదాయం వ్యవస్థాపక సాధువు అయిన బసవన్న పుట్టినరోజును సూచిస్తుంది. ఈ ఉత్సవాలు దక్షిణ భారతదేశం అంతటా, ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుపుకుంటారు.
ప్రభాస్‌గా సుపరిచితుడైన ఉప్పలపాటి ప్రభాస్ రాజు ఒక సినీ నటుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహకుడు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నరు రాష్ట్రానికి నిర్వాహక అధికారి, న్యాయాధికారి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల జరిగిన తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా మెజారిటీ స్థానాలు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ ను (గతంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ఢిల్లీ) సాధారణంగా IIT ఢిల్లీ లేదా IITD అని పిలుస్తారు, ఇది భారతదేశం, ఢిల్లీలోని అతిపెద్ద ఇంజనీరింగ్ కళాశాల. భారతదేశంలోని ఇతర IITల సమాఖ్యలో భాగంగా ఉంది.
పెరూ (ఆంగ్లం Perú), ( స్పానిష్ : పెరూ ; క్వెచువా : పెరు లేదా Piruw ; ( ఐమారా : పిర్యూ) అధికారికంగా పెరూ రిపబ్లిక్ ( స్పానిష్ : రిపబ్లికా డెల్ పెరూ ") దక్షిణ అమెరికా వాయువ్యభాగంలో ఉన్న ఒక దేశం. పెరూ దక్షిణ సరిహద్దులో చిలీ, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం, ఆగ్నేయ సరిహద్దులో బొలీవియా, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, ఉత్తర సరిహద్దులో ఈక్వడార్, కొలంబియా దేశాలు ఉన్నాయి. పెరూ వైవిధ్యమైన భౌగోళికస్థితి, పర్యావరణం కలిగి ఉంటుంది.
పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2000-2009)
పద్మశ్రీ పురస్కారం, భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం - 2000 - 2009 సంవత్సరాల మధ్య విజేతలు:
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి
సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠానికి 71వ ఉత్తరాధికారిగా నియమితులయ్యాడు. 2025 ఫిబ్రవరి 30న అక్షయ తృతీయ సందర్భంగా అతనిని 70వ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల ద్వారా సన్యాస దీక్ష స్వీకరించాడు. విజయేంద్ర సరస్వతి గణేష్ శర్మను సన్యాస దీక్షనిచ్చి "శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి" గా నామకరణం చేశారు.
గ్రాండ్ తెఫ్ట్ ఆటో: వైస్ సిటీ అనేది యాక్షన్-అడ్వెంచర్ వీడియో గేమ్, ఇది రాక్‌స్టార్ నార్త్ చే అభివృద్ధి చేయబడింది , రాక్‌స్టార్ గేమ్స్ దీని ప్రచురించింది. ఇది 29 అక్టోబర్ 2002 న ప్లేస్టేషన్ 2 కొరకు, 12 మే 2003 న మైక్రోసాఫ్ట్ విండోస్ కొరకు , 31 అక్టోబర్ 2003 న Xbox కొరకు విడుదలైంది. ఆట యొక్క పదవ వార్షికోత్సవం కోసం 2012 లో మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం మెరుగైన వెర్షన్ విడుదల చేయబడింది.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
ఫోటోగ్రఫీ లేదా ఛాయాగ్రహణం లేదా ఛాయాచిత్రకళ (ఆంగ్లం: Photography) అనేది కాంతి లేదా కాంతికి సంబంధించిన శక్తి యొక్క చర్యచే, కాంతికి స్పందించగలిగే ఉపరితలం (Photosensitive Material, అనగా ఫిల్మ్ లేదా ఇమేజ్ సెన్సర్) పై ప్రతిబింబం (image) గా నమోదు చేయటం. ఫోటోగ్రఫీ కటక శాస్త్రము (Optics), రసాయన శాస్త్రము ల సంగమం. ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను భద్రపరచటంతో బాటు రసాయనిక చర్యలతో కాంతి సూక్ష్మాలని గుర్తించే ఛాయాగ్రాహక చిత్రం (photographic film) వలన గానీ /ఎలక్ట్రానిక్ ప్రక్రియతో ఇమేజ్ సెన్సర్ (చిత్రాలని గుర్తించే పరికరము) వలన గానీ మన్నికైన చిత్రాలని సృష్టించే/ముద్రించే ఒక కళ/శాస్త్రము/అభ్యాసము.
శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ, 2018లో ఆరవసారి ఎమ్మెల్యే గెలిచిన తరువాత భారత్ రాష్ట్ర సమితి పార్టీలో మొదటి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నాడు.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1954 నుండి భారతీయ సినిమాకు ప్రదానం చేయబడుతున్న ప్రముఖమైన పురస్కారాలు. ఈ పురస్కారాలలో భాగంగా రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూలులో పేర్కొన్న ప్రాంతీయ భాషా చిత్రాలకు కూడా బహుమతి ప్రదానం చేస్తున్నారు. రెండవ సంవత్సరం (1955) నుండిఅస్సామీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మళయాల,మరాఠీ, తమిళ, తెలుగు భాషలలో ఉత్తమ చిత్రానికి రాష్ట్రపతి వెండిపతకం, ఉత్తమ ద్వితీయ, తృతీయ చిత్రాలకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేయడం ప్రారంభించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
హిట్: ది థర్డ్ కేస్ 2025లో రూపొందుతున్న తెలుగు సినిమా. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నాని, శ్రీనిధి శెట్టి, అడివి శేష్, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 ఫిబ్రవరి 24న, ట్రైలర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేసి, సినిమాను 2025 మే 1న విడుదల చేయనున్నారు.
చంద్రశేఖరేంద్ర సరస్వతి (1894 మే 20, – 1994 జనవరి 8) కంచి కామకోటి పీఠం జగద్గురుగా అధిష్టించిన వారి వరసక్రమంలో 68వ వారని తెలుస్తుంది. పీఠం అధిష్టించినప్పటి నుండి పీఠం అదిష్టించినవారిని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తుంది. జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటాడు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.
తెలుగు లిపి ఇతర భారతీయ భాష లిపుల లాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి.
21 వ శతాబ్దములో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలకు ఆస్ట్రేలియాలోని సుందరనగమైన సిడ్నీ వేదికగా నిలిచింది. 2000 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగిన 27 వ ఒలింపిక్ క్రీడలలో 199 దేశాల నుంచి 10651 క్రీడాకారులు పాల్గొని తమ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. 298 క్రీడాంశాలలో పోటీలు జరుగగా అమెరికా 37 క్రీడాంశాలలో నెగ్గి అత్యధిక స్వర్ణ పతకాలతో ప్రథమస్థానంలో నిలిచింది.భారత్‌కు చెందిన కరణం మల్లేశ్వరి మహిళల 69 కిలోగ్రాముల వెయిట్ లిప్టింగ్లో కాంస్యం సాధించి భారత్‌కు ఏకైక పతకం సంపాదించిపెట్టింది.