The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
హిట్: ది థర్డ్ కేస్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నాని, శ్రీనిధి శెట్టి, అడివి శేష్, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 ఫిబ్రవరి 24న, ట్రైలర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేసి, సినిమాను 2025 మే 1న విడుదల చేశారు.
ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.పూర్వం ఎద్దుల పురం అని పిలిచేవారు. దీని ముఖ్యపట్టణం ఆదిలాబాద్..బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు ఆదిలాబాదును 'ఎడ్లవాడ' అని పిలిచే వారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇది ఒకటి.
ఆది శంకరాచార్యులు (ఆది శంకరులు, శంకర భగవత్పాదులు ) ( సంస్కృతం : आदि शङ्कराचार्यः IAST: Ādi Śaṅkarācāryaḥ ) అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. సా.శ 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు.
కంబోడియా (English: Cambodia లేదా Kampuchea; Khmer: កម្ពុជា, Kâmpŭchéa కంపూచియా ), ఆధికారికంగా కంపూచియా సామ్రాజ్యము అని గుర్తించబడే ఈ దేశం ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉంది. ఈ దేశం మొత్తం భూ వైశాల్యం 181,035 చదరపు కిలోమీటర్లు. కాంబోడియా వాయవ్య సరిహద్దులలో థాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలో థాయ్ లాండ్ జలసంధి ఉన్నాయి.
1860 లో మొదలైన వెయ్యి మంది సాహసికుల యాత్ర (Italian:- Spedizione dei Mille) అనే ఈ దండయాత్రకు తిరుగుబాటు జనరల్ గిసేప్పి గరిబాల్ది నేతృత్వం వహించాడు. ఈ స్వచ్ఛంద సైనికుల దళం రెండు సిసిలీల రాజ్యాన్ని ఓడించింది. దీని వలన ఆ రాజ్యం రద్దుచెయబడి సార్దీనియాకు స్వాధీనం చెయడం జరిగినది, ఇది ఏకీకృత ఇటలీ రాజ్యం ఏర్పడటంలో ఒక ముఖ్యమైన ఘట్టం.
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా
ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా. ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాల కోసం ఇదే వ్యాసం చర్చాపేజీ చూడండి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
తెలుగు సాంస్కృతిక చరిత్ర కళలు, నిర్మాణ శైలి, సాహిత్యం, ఆహారపుటలవాట్లు, ఆంధ్రుల దుస్తులు, మతం, తత్త్వాలుగా విభజించవచ్చు. ఇక్కడి వాగ్గేయకారులు, కూచిపూడి (నృత్యము) సుసంపన్నమైన సంస్కృతి-సంప్రదాయాలకి నిలువెత్తు సాక్ష్యాలు. కర్ణాటక సంగీతం లో, శాస్త్రీయ సంగీతంలో తెలుగు భాష ఇట్టే ఇమిడి పోవటంతో ఆంధ్ర ప్రదేశ్ సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి మాతృకగా వ్యవహరించింది.
ఆంధ్రప్రదేశ్ విశిష్ట దేవాలయాలు
(పెద్దపాడు) వీరలక్షీచెన్నకేశవస్వామి ఆలయము {జనమేజయప్రతిస్ఠిత} ఈఆలయము చాలా పురాతనమైనది ||శ్లో|| సుందరాయశుభాంగాయ మంగళాయమహోదధేః ! పెద్దపాడునివాసాయ సార్వభౌమాయమంగళం!! అని కొలిచేవారికి కొంగుబంగారంగా స్వామి వెలుగొందుచున్నారు, ఈఆలయంలో ప్రతి శనివారము ఉదయం 6.00గంటలకు విశేషఅభిషేకములు ప్రతిసంవత్సరం వైశాఖశుద్ధ త్రయోదశీరోజు భూధేవీ శ్రీదేవీసమేత చెన్నకేశవస్వామి వారికి అంగరంగవైభవంగా కళ్యాణం విశేషసేవలు జరుగును, పర్వదినములలో పల్లకిసేవలు జరుగును, ఈఆలయమునకు అనుబంధముగా శివాలయము, హనుమదాలయముు, నవగ్రహములుు, పార్వతీమాతత, బాలసుబ్రహ్మణ్యస్వామి, స్వయంగావెలసినన పురాతన బాలవినాయకుడు కలరు, షష్ఠిపూజలుు, సంకష్టహరచతుర్థిి, దేవీనవరాత్రులుు, వసంతనవరాత్రులుు, గణపతిణవరాత్రులు, హనుమాన్ సేవలు, విశేషహోమాలు, విశేషంగాజరుగును.
పెరూ (ఆంగ్లం Perú), ( స్పానిష్ : పెరూ ; క్వెచువా : పెరు లేదా Piruw ; ( ఐమారా : పిర్యూ) అధికారికంగా పెరూ రిపబ్లిక్ ( స్పానిష్ : రిపబ్లికా డెల్ పెరూ ") దక్షిణ అమెరికా వాయువ్యభాగంలో ఉన్న ఒక దేశం. పెరూ దక్షిణ సరిహద్దులో చిలీ, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం, ఆగ్నేయ సరిహద్దులో బొలీవియా, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, ఉత్తర సరిహద్దులో ఈక్వడార్, కొలంబియా దేశాలు ఉన్నాయి. పెరూ వైవిధ్యమైన భౌగోళికస్థితి, పర్యావరణం కలిగి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 జూన్ 2 నుండి, 13 జిల్లాలతో కొనసాగింది. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం, తన మానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2022 ఏప్రిల్ 4 నుండి ఆంధ్రప్రదేశ్ ను 26 జిల్లాలగా పునర్వ్యస్థీకరించింది.
గ్రామము లేదా గ్రామం, అనే దానికి అధికార నిర్వచనం 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామముగా గవర్నర్ ప్రకటించిన ప్రాంతం.దీనినే రెవెన్యూ గ్రామం అని కూడా అంటారు.ఇది అనేక నివాస ప్రాంతాలను (నివాసాల సముదాయాలను) లేదా పల్లెలను కలిపి కూడా ఒక గ్రామంగా నోటిఫై చేయవచ్చు, పేర్కొన్న అంశాలపై శాసనసభ చట్టాలని చేసి నిర్ణయించడమే కాకుండా, వాటిలో మార్పులు, చేర్పులు చేసే అధికారం ఉంది. ఇది పట్టణం లేదా నగరం కంటే చిన్నదిగా ఉంటుంది. గూడెం (Hamlet) కంటే పెద్దదిగా ఉండవచ్చు.
చంద్రశేఖరేంద్ర సరస్వతి (1894 మే 20 – 1994 జనవరి 8) కంచి కామకోటి పీఠం జగద్గురుగా అధిష్టించిన వారి వరసక్రమంలో 68వ వ్యక్తి. పీఠం అధిష్టించినప్పటి నుండి పీఠం అదిష్టించినవారిని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తుంది. జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటాడు.
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా
గణతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తాడు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల లోని 3 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి గవర్నరు అధిపతి అయిన నిర్వహణ విషయాలు ముఖ్యమంత్రి చేపడతారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (ఏ.పి.యస్.ఆర్.టి.సి (APSRTC) ) ప్రభుత్వ రంగంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ. రాష్ట్రంలోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరాలలో సిటీ బస్సు సేవలను, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్ఘడ్, గోవా లకు బస్సులు నడుపుతుంది.
లాట్వియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ లాట్వియా) ఉత్తరఐరోపాలో బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న మూడు దేశాలలో ఇది ఒక దేశము. ఈ దేశానికి ఉత్తరసరిహద్దులో ఎస్టోనియా, దక్షిణసరిహద్దులో లిథువేనియా, తూర్పుసరిహద్దులో రష్యా, ఆగ్నేయసరిహద్దులో బెలారస్ దేశాలు ఉన్నాయి. బాల్టిక్ సముద్ర తీరానికి ఆవల పశ్చిమసరిహద్దులో స్వీడన్ దేశం ఉంది.లాట్వియా జనసంఖ్య 19,57,200.
రష్యా సమాఖ్య లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
1972 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా దిగువనీయబడింది.
పుచ్చలపల్లి సుందరయ్య (1913 – 1985) ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఇతను అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు.
రొమేనియా లేక రొమానియా (పురాతన ఉఛ్ఛారణలు: రుమానియా, రౌమానియా) ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశము. దేశప్రధాన సరిహద్దు దేశాలలో ఉత్తరాన ఉక్రెయిన్, దక్షిణాన బల్గేరియా, తూర్పున మోల్డోవా, పశ్చిమాన హంగేరీ, సెర్బియాలు ఉన్నాయి.దేశం నల్లసముద్రం తీరంలో ఉంది.దేశవైశాల్యం 238397 చ.కి.మీ. దేశంలో టెంపరేట్ కాంటినెంటల్ వాతావరణం ఉంటుంది.
కోటప్పకొండ, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అది నేత ఇంద్ర దేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ.
ఫోటోగ్రఫీ లేదా ఛాయాగ్రహణం లేదా ఛాయాచిత్రకళ (ఆంగ్లం: Photography) అనేది కాంతి లేదా కాంతికి సంబంధించిన శక్తి యొక్క చర్యచే, కాంతికి స్పందించగలిగే ఉపరితలం (Photosensitive Material, అనగా ఫిల్మ్ లేదా ఇమేజ్ సెన్సర్) పై ప్రతిబింబం (image) గా నమోదు చేయటం. ఫోటోగ్రఫీ కటక శాస్త్రము (Optics), రసాయన శాస్త్రము ల సంగమం. ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను భద్రపరచటంతో బాటు రసాయనిక చర్యలతో కాంతి సూక్ష్మాలని గుర్తించే ఛాయాగ్రాహక చిత్రం (photographic film) వలన గానీ /ఎలక్ట్రానిక్ ప్రక్రియతో ఇమేజ్ సెన్సర్ (చిత్రాలని గుర్తించే పరికరము) వలన గానీ మన్నికైన చిత్రాలని సృష్టించే/ముద్రించే ఒక కళ/శాస్త్రము/అభ్యాసము.
సోవియట్ సమాఖ్య లేదా సోవియట్ యూనియన్ , అధికారికంగా సోవియట్ సామ్యవాద గణతంత్రాలు సమాఖ్య , సూక్ష్మ రూపం యు.ఎస్.ఎస్.ఆర్ (ఆంగ్లము USSR నుండి) ఇంకనూ సోవియట్ యూనియన్ (రష్యన్ లో Советский Союз ) ; (రోమనీకరణ : Sovetsky Soyuz), రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సోషలిస్టు రాజ్యం. ఇది యురేషియాలో 1922 నుండి 1991 వరకు విలసిల్లింది. 1991 లో ఇందు నుండి దీని రిపబ్లిక్ రాష్ట్రాలు విడిపోయాయి.
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసంతెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత, ధర్మశాస్త్రం సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం: Pakistan) (ఉర్దూ: پاکستان): దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రంలను సరిహద్దులుగా కలిగి ఉంది. 24 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
వంగ - వంకాయ (Brinjal) - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశానికి ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారత దేశానికి వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు రకరకాలుగా - చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు - లభిస్తున్నాయి.
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి 2021లో విడుదలైంది తెలుగు సినిమా. 2019లో మలయాళంలో విడుదలైన 'వికృతి' చిత్రాన్ని తెలుగులో అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఆలీ, కొణతాల మోహన్, శ్రీచరణ్ నిర్మించారు. ఆలీ, నరేష్, పవిత్ర లోకేష్, మౌర్యాని, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 28న ఆహా ఓటీటీలో విడుదలైంది.
సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి
సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠానికి 71వ ఉత్తరాధికారిగా నియమితులయ్యాడు. 2025 ఫిబ్రవరి 30న అక్షయ తృతీయ సందర్భంగా అతనిని 70వ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల ద్వారా సన్యాస దీక్ష స్వీకరించాడు. విజయేంద్ర సరస్వతి గణేష్ శర్మను సన్యాస దీక్షనిచ్చి "శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి" గా నామకరణం చేశారు.
చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.చందమామను బి.నాగిరెడ్డి - చక్రపాణి (వీరు తెలుగు, తమిళ భాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) 1947 జూలైలో ప్రారంభించారు.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927, జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సం.ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యా.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2014 సార్వత్రిక ఎన్నికలతో సహా 2014 రాష్ట్రంలో ఎన్నికలు ఏడవ దశ ( 2014 ఏప్రిల్ 30), ఎనిమిదవ దశ ( 2014 మే 7)ల్లో నిర్వహించారు. అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన చివరి ఎన్నికలు ఇవే, విభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో తెదేపా, భాజపా కలసి జనసేన మద్ధతుతో పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణలో తెరాస ఏకపక్షంగా పోటీచేసి అధికారంలోకి వచ్చింది.
బ్రహ్మపుత్ర (Brahmaputra river) (అస్సామీ భాష: ব্ৰহ্মপুত্ৰ, బెంగాలీ భాష: ব্রহ্মপুত্র} హిందీ భాష: ब्रम्हपुत्र, టిబెటన్ భాషཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం. టిబెట్‌లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నదిగా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
యెన్నెన్జీ (నరేందర్ గౌడ్ నాగులూరి) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా రచయిత, దర్శకుడు, నటుడు. ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో 2013లో దర్శకత్వం వహించిన ‘యాది’ , ‘రాజిగ ఓరి రాజిగా’ అనే లఘు చిత్రాలు అతడికి మంచి గుర్తింపును తెచ్చాయి. 2021లో వచ్చిన మెయిల్ సినిమాలో కంప్యూటర్ వైరస్ మెకానిక్ షకీల్ పాత్రలో నటించాడు.