The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..
ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.
లారెన్స్ బిష్ణోయ్ (ఆంగ్లం: Lawrence Bishnoi; జననం 1993 ఫిబ్రవరి 12) ఒక భారతీయ ముఠా నాయకుడు, అతను 2015 నుండి ఖైదు చేయబడ్డాడు. అతను దోపిడీ, హత్య సహా పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు, అయితే, అతను అన్ని ఆరోపణలను ఖండించాడు. అతని ముఠా భారతదేశం అంతటా పనిచేస్తున్న 700 మందికి పైగా షూటర్లతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
రష్మిక మందన్న (జననం 5 ఏప్రిల్ 1996) ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలలో పని చేస్తారు. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఆమె నాలుగు సైమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.
ఆయుధ పూజ అనేది ప్రధానంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకునే హిందూ పండుగ. ఇది సాధారణంగా సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో, నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజున వస్తుంది. ఆయుధ పూజ అనేది వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి ప్రజల జీవితంలో అంతర్భాగమైన పరికరాలు, సాధనాలను పూజించడానికి అంకితం చేయబడిన రోజు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
జైకిషన్ కాకుభాయ్ ష్రాఫ్ (జననం 1957 ఫిబ్రవరి 1) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటుడు. ఆయన 1982లో సినీరంగంలోకి అడుగుపెట్టి సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన హీరో (1983) సినిమాలో నటనకుగాను ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. జాకీ ష్రాఫ్ హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, తెలుగు, మలయాళం, పంజాబీ, భోజ్‌పురి, కొంకణి, ఒడియా, గుజరాతీ & ఇంగ్లీషుతో సహా మొత్తం 13 భాషలలో 220 సినిమాల్లో నటించాడు.
కళానిధి మారన్ (జననం 1964 జూలై 24) ఒక భారతీయ బిలియనీర్ మీడియా యజమాని. ఆయన భారతదేశంలోని అతిపెద్ద మీడియా సమ్మేళనాలలో ఒకటైన సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్. ఆయన బహుళ టెలివిజన్ ఛానళ్లు, వార్తాపత్రికలు, వారపత్రికలు, ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లు, డిటిహెచ్ సేవలు, ఒక చలనచిత్ర నిర్మాణ సంస్థ (సన్ పిక్చర్స్), మూడు క్రికెట్ జట్టు ఫ్రాంచైజీలను కలిగి ఉన్నాడు: ఇండియన్ ప్రీమియర్ లీగ్, సన్రైజర్స్ హైదరాబాద్, దక్షిణాఫ్రికాలో ఎస్ఎ 20 లీగ్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ఇంగ్లాండులోని ది హండ్రెడ్ లో సన్రైజర్ లీడ్స్.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.
షెఫాలీ వర్మ (జననం 2004 జనవరి 28) భారతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు. దేశంలో అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ట్వెంటీ ట్వెంటీ మ్యాచ్ ఆడిన క్రికెటర్. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ టెండుల్కర్ పేరిట 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును షెఫాలీ బద్దలు కొట్టింది.
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లయ్యపల్లెలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.
మావూళ్ళో మహాశివుడు 1979లో విడుదలైన తెలుగు సినిమా. గీతా సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై దాసరి సత్యనారాయణ మూర్తి, వేగి వీరరాజు లు నిర్మించిన ఈ చిత్రానికి రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, సుభాషిని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.
భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927, జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సంవత్సరాల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు.
నవ్‌రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (సినిమా)
ఆంధ్ర దేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. కాలజ్ఞానిగా ప్రసిద్ధుడైన ఈ యోగిపురుషుని జీవి కథను నందమూరి తారకరామారావు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించాడు. తానే స్వయంగా నటించాడు, దర్శకత్వం వహించాడు.
దుర్గా దేవి (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత.రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన లలితా దేవి (మహాదేవి) వివిధ రూపాలను తీసుకుంటుంది.లలితా దేవి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి.దేవీ మహాత్మ్యం ప్రకారం జగన్మాత లలితా దేవి మహిషాసుర అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ (1895 సెప్టెంబరు 10 - 1976 అక్టోబరు 18) 20వ శతాబ్దపు తెలుగు రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, "కవి సామ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ అనేది హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలోని ఒక ప్రధాన భాగం. తెలుగు సినిమా పితామహుడిగా కీర్తించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆసియాలోని వివిధ ప్రదేశాలకు పర్యటించి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్‌తో కలిసి భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు.
జైలర్ 2023లో విడుదలైన యాక్షన్ కామెడీ సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మింస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం రజనీకాంత్ యొక్క 169వ చిత్రం అయిన తలైవర్ 169 అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్రవరి 2022లో అధికారికంగా ప్రకటించబడింది, జూన్‌లో అధికారికంగా జైలర్ అనే టైటిల్‌ను ప్రకటించారు. రజినీకాంత్, శివరాజ్‌కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఆగష్టు 10న ఏషియన్ మల్టీప్లెక్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు విడుదల చేశాయి.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు
పంచాయితీరాజ్ వ్యవస్థను తొలిగా ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండవది. 1959 నవంబరు 1 న, ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితి, బ్లాకు పంచాయితీ సమితి, జిల్లా పరిషత్తు లతో కూడిన మూడంచెల విధానం అమలులోకి వచ్చింది. 1986లో ప్రజలవద్దకు పాలన అనే నినాదంతో 20-30 గ్రామాలను మండలంగా చేర్చి, బ్లాకు స్థాయిలో మండల ప్రజాపరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
శరణ్య ప్రదీప్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె న్యూస్ రీడర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 2017లో విడుదలైన 'ఫిదా' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ సినిమాలో నటనకుగాను మంచి ప్రశంసలు అందుకొని ఆ తరువాత 'ఖుషి' , 'భామాకలాపం -2' , 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకొంది.