The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్ లోని నడియాడ్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
2026 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయ ఆచార్యుడు, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త. ఈయన ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పాశ్చాత్య నాగరికతను మార్చివేసాయి. లూథర్ ధర్మ శాస్త్రము పోప్ ఆధిక్యతను ప్రశ్నించింది.
[[Category:Articles lacking in-text citations --> from 2023 అక్టోబరు<~--]] జాతీయ ఐక్యతా దినోత్సవంను, భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించి 24-10-2014న ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని భారత హోంమంత్రి రాజ్ నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు 1న జరపటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.
రెడ్డి విజయలక్ష్మి, గరివిడి లక్ష్మిగా ప్రజాదరణ పొందిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద, బుర్రకథ కళాకారిణి. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం..
నిధి రజ్దాన్ (జననం 11 ఏప్రిల్ 1977) ఒక భారతీయ పాత్రికేయురాలు, టెలివిజన్ వ్యక్తి. ఆమె ఎన్డీటీవీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎన్డీటీవీ 24x7 న్యూస్ డిబేట్ షో లెఫ్ట్, రైట్ & సెంటర్, వారపు డిబేట్ షో ది బిగ్ ఫైట్ యొక్క ప్రాథమిక యాంకర్. 1999 నుండి, రజ్దాన్ అనేక రకాల వార్తా కార్యక్రమాలను కవర్ చేసింది, వరుస కార్యక్రమాలను నిర్వహించింది, తరచుగా వార్తల దృశ్యం నుండి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
మహేంద్రగిరి వారాహి 2026లో తెలుగులో విడుదలైన మైథలాజికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కలిపు మధు, సురభి లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. సుమంత్, ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, మీనాక్షి గోస్వామి, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2026 ఆగష్టు 15న, ట్రైలర్‌ను ఆగష్టు 28న విడుదల చేసి సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేశారు.
సంజయ్ గుప్తా (1969 అక్టోబరు 23 – 2026 అక్టోబరు 30) మహారాష్ట్రకు చెందిన హిందీ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. సంజయ్ గుప్తా ఎక్కువగా అమెరికన్ యాక్షన్-థ్రిల్లర్, క్రైమ్ సినిమాల రీమేక్‌లకు ప్రసిద్ధి చెందాడు. ఆతిష్, కాంటే, కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, షూటౌట్ ఎట్ వడాలా, జజ్బా, జిందా, కరమ్, ముంబై సాగా వంటి సినిమాలు తీశాడు.
ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ప్రత్యగాత్మ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం 1969, జూన్ 6వ తేదీన విడుదలయ్యింది.అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత , జంటగా నటించిన ఈ చిత్రం లో చిత్తూరు నాగయ్య, గుమ్మడి , అంజలీ దేవి,నాగభూషణం, ఎస్ వరలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, భారత ప్రభుత్వం చే ఈచిత్రం ఎంపిక కాబడింది. ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
బిగ్‌బాస్ (తెలుగు రియాలిటీ గేమ్)
బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ (రియాలిటీ గేమ్) కు స్టార్ మా లో ప్రసారమవుతున్న తెలుగు మాతృక. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.
2026 ఆంధ్రప్రదేశ్ నగరపాలక, పురపాలక ఎన్నికలు
భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి **2026 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు** నిర్వహించడానికి షెడ్యూల్ చేయబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
సారా అర్జున్ (ఆంగ్లం: Sara Arjun; 2005 జూన్ 18) భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం, హిందీ సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలలో నటిస్తుంది. విక్రమ్ నటించిన తమిళ చిత్రం థైవ తిరుమల్ తో ఆమె బాలతారగా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె తమిళం, హిందీలతో పాటు తెలుగు, మలయాళం చిత్రాలలోనూ బాలనటిగా అనేక సినిమాలు చేసింది.
బల్మూరి వెంకట్ నర్సింగరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
ది ప్యారడైజ్ 2026లో విడుదల అయిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
అన్నదాత సుఖీభవ అనేది చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు ఏడాదికి ₹15,000 పెట్టుబడి మద్దతు అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమం.భారత ప్రభుత్వం వారి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM కిసాన్) లో భాగంగా ఇచ్చే ₹6000 కు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి దాదాపు 70 లక్షల రైతులకు మద్దతు అందిస్తోంది నగదును నేరుగా రైతుకు అందించే ఈ పెట్టుబడి మద్దతు పథకం ఆధార్ బ్యాంకు ఖాతాలన్నీ రైతులు కవర్ చేస్తుంది లింక్ ఎటువంటి షరతులు లేకుండా యూనిట్ ఆధారంగా కుటుంబ రాష్ట్రంలో. అధికారికంగా 19 ఫిబ్రవరి 2019 న ప్రారంభించబడింది ₹ 1000 ప్రారంభంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్న కుటుంబాల సంఖ్యను అధికారిక వెబ్ సైట్ లో ప్రదర్శిస్తోంది.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
ఏబీ వెంకటేశ్వరరావు (ఆపూర్బో భట్టాచార్య వెంకటేశ్వరరావు) ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన చేసిన సేవలు, ఆ తర్వాతి కాలంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయపరమైన సవాళ్ల వల్ల ఆయన వార్తల్లో నిలిచారు.
ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు. 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.
మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు
అక్టోబర్ 31వ తేదీ క్రైస్తవ మతంలో ప్రాటెస్టులు సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు. 1517లో ఈ దినాన మార్టిన్ లూథర్ తన 95 సిద్ధాంతాలను బహిరంగ చర్చకోసమని విటెన్ బర్గ్ దేవాలయ తలుపులమీద మేకులతో కొట్టాడు. ఈ సంఘటన క్రైస్తవ లోకంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపింది.
ఆనంది / రక్షిత (జననం 1992 జులై 20) ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాలలో కనిపించే భారతీయ నటి. తెలుగు చిత్రం బస్ స్టాప్ (2012)లో అరంగేట్రం చేసిన తరువాత ఆమె వెట్రిమారన్ రూపొందించిన తమిళ చిత్రం పోరియాలన్ (2014)లో నటించింది. అదే సంవత్సరం ప్రభు సోలమన్ కాయల్ (2014) తో ఆమె తన కెరీర్ లో పురోగతి సాధించింది, దీని ద్వారా ఆమె కాయల్ ఆనందిగా గుర్తింపు పొందింది.
గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం. ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికి, భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది, ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన హిందూ దేవాలయం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇది ఒక స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర రాజ్యాంగ, చట్టపరమైన అధికారం కలిగిన సంస్థ. ఇది భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్సు 243 జెడ్ఎ, 243 కె కింద ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది.
భారతదేశానికి మూడవ ప్రధాని ఇందిరాగాంధీ అక్టోబరు 31, 1984 తేదీన న్యూఢిల్లీ లోని సఫ్దార్‌జంగ్ రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు హత్య గావించబడింది. ఆమెను స్వంత అంగరక్షకులైన సత్వంత్‌సింగ్, బియాత్‌సింగ్ లే హత్య చేశారు. ఈ హత్య అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం జూన్ 1984న జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్కు ప్రతీకారంగా జరిగింది.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
సైంధవ్ 2024లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియోను ఆగష్టు 15న విడుదల చేశారు.