The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మానవ్ జగదుసకుమార్ సుతార్ (జననం 3 ఆగస్టు 2002) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో రాజస్థాన్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఆయన 2022 ఫిబ్రవరి 17న 2021–22 రంజీ ట్రోఫీలో ఆంధ్రపై తన ఫస్ట్-క్లాస్, 2022–23 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 2022 అక్టోబర్ 11న మధ్యప్రదేశ్‌పై తన టీ20 అరంగేట్రం చేశాడు.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. సుప్రియ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
కొణిదెల పవన్ కళ్యాణ్ (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్థుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం - చారిత్రక నేపథ్యం
భారతదేశ చరిత్ర రచన ప్రధానంగా సామ్రాజ్యాలు, రాజులు, అధికార కేంద్రాల చుట్టూ తిరుగుతూ వచ్చింది. ఈ ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి, ప్రజల పక్షాన నిలబడి, అణచివేతకు ఎదురు నిలిచిన అనేక ప్రాంతీయ వీరులు చరిత్రలో తగిన స్థానం పొందలేదు. అటువంటి విస్మరించబడిన ప్రజావీరుల్లో సర్దార్ పాపన్న (పాపన్న గౌడ్) ఒకరు.
'నా మొగుడు నాకే సొంతం' 1989, జూలై,14 న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు, జయసుధ, శరత్ బాబు, దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం, కె వి మహదేవన్ సమకూర్చారు.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (ఆగష్టు 18, 1650 - ఏప్రిల్ 2, 1709) 17వ శతాబ్దపు డెక్కన్ ప్రాంతానికి చెందిన ప్రముఖ తిరుగుబాటు వీరుడు మరియు ప్రజా నాయకుడు. ఆయన మొఘల్ సామ్రాజ్య నిరంకుశ ఆధిపత్యానికి మరియు నాటి భూస్వామ్య జాగీర్దారీ వ్యవస్థలోని పన్నుల దోపిడీకి వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను (బహుజనులను) సంఘటితం చేసి చారిత్రాత్మక పోరాటం సాగించారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలతో ఖిలాషాపూర్, తాటికొండ, సర్వాయిపేట వంటి వ్యూహాత్మక కోటలను నిర్మించి, ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య పాలనను అందించారు.
రవీంద్ర సిన్హ్ అనిరుధ్‌సిన్హ్ జడేజా (జననం : 1988- డిసెంబర్ -6 ) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. రవీంద్ర జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు. ఆయన అనిల్ కుంబ్లే తర్వాత ఐసిసి వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి భారతీయ బౌలర్.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల జాబితా
ఇది ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుత, గత సభ్యుల జాబితా. రాష్ట్రం తరుపున శాసనమండలికి ఆరు సంవత్సరాల కాలానికి సభ్యులను ఎన్నుకుంటుంది. 20 మంది సభ్యులను రాష్ట్ర శాసనసభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు.
జనగణమన భారత గణతంత్రం నకు జాతీయ గీతం. దీనిని తొలుత బెంగాలీలో "భారత భాగ్య విధాతా" గా బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యకర్త, భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911 డిసెంబరు 11 న రచించాడు "భారత భాగ్య విధాతా" గీతంలోని మొదటి చరణాన్ని, తొలుత బ్రహ్మ సమాజం కోసం హిందూ మతపరమైన స్తోత్రంగా రచించగా, భారత రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 24 న జాతీయ గీతంగా స్వీకరించింది. జాతీయ గీతాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడానికి సుమారు 52 సెకన్ల సమయం పడుతుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
దేవదత్ పాడిక్కల్ (జననం 7 జూలై 2000) భారత క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో కర్ణాటక తరపున ఆడుతున్నాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ఆయన భారత అండర్-19 జట్టు తరపున ఆడి, జూలై 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ ద్వారా భారత జట్టుతో అరంగేట్రం చేశాడు.