The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల జాబితా
ఇది ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుత, గత సభ్యుల జాబితా. రాష్ట్రం తరుపున శాసనమండలికి ఆరు సంవత్సరాల కాలానికి సభ్యులను ఎన్నుకుంటుంది. 20 మంది సభ్యులను రాష్ట్ర శాసనసభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఖాన్ దంపతుల పెద్ద కుమారుడు. భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు.
కొరియన్ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (విధాన పరిషత్), ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థలోని సభలలో ఎగువసభ. 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది.
అట్లూరి పుండరీకాక్షయ్య (ఆగష్టు 19, 1925 - ఫిబ్రవరి 2, 2012), తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన, మా వారి మంచితనం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 2017 ఆగస్టు 19న జరిగిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణానికి సంబంధించిన ఘటన. ఈ ఘటనలో కర్నూలు జిల్లా కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల యాజమాన్యంపై అత్యాచారం హత్య ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసు సీబీఐ విచారణకు మారగా, విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చేయగా, వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి 112 కులాలు ఉన్నాయని గుర్తించినట్లు ప్రకటించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనల మేరకు ఈ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది.
ప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవం (World Mosquito Day) గా జరుపుకుంటారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ని 1897 ఆగస్టు 20న కనుగొన్న సందర్బంగా ఆరోజును గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగష్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) (ఉద్యోగుల భవిష్య నిధి) (The Employees' Provident Fund Organisation (EPFO) భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ క్రింద ఉన్న రెండు ప్రధాన చట్టబద్ధమైన సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్ల నియంత్రణ నిర్వహిస్తుంది, మరొకటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఉద్యోగులు ప్రతి నెల వారి వేతనంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం స్థాపించిన సంస్థ.
గోదారి గట్టుపైన 2026లో విడుదలైన తెలుగు ప్రేమకథా హాస్య నాటక చిత్రం. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
రైఫిల్మన్ జశ్వంత్‌సింగ్ రావత్, మహావీర చక్ర (1941 ఆగస్టు 19 - 1962 నవంబరు 17) గఢ్వాల్ రైఫిల్స్‌లో పనిచేసిన భారతీయ సైనిక దళ సైనికుడు. అతను 1962 లో భారత చైనా యుద్ధం సందర్భంలో, అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన నూరనాంగ్ యుద్ధంలో అతని పోరాటం ఫలితంగా మరణానంతరం మహా వీర చక్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు. భారత చైనా యుద్ధంలో భారత సైనికులు వెనుతిరిగిన సందర్భంలో అతను ఒక్కడే తన స్థానం నుంచి కదలకుండా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సేనలపై గుళ్ల వర్షం కురిపించాడు.
భారతదేశ చరిత్ర లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్‌పర్సన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎగువ సభకు అధ్యక్షత వహిస్తారు. చైర్‌పర్సన్ చర్చలు, సభ కార్యకలాపాలను నియంత్రిస్తారు. ఈ కార్యాలయం 1958 నుండి 1985 మే 31 వరకు ఉనికిలో ఉంది.
ప్రపంచ మానవత్వపు దినోత్సవం ను ప్రతి సంవత్సరం ఆగస్టు 19 న జరుపుకుంటారు. మానవతావాద సిబ్బందిని, జీవకారుణ్యం కోసం పనిచేస్తూ వారి జీవితాలను కోల్పోయిన వారిని గుర్తిస్తూ అంకితమివ్వబడింది ఈ రోజు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ సమన్వయాన్ని పటిష్ఠ పరచేందుకు స్వీడిష్ నడుపుతున్న GA రెజల్యూషన్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ చే ఆగస్టు 19 గుర్తించబడింది.
భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవస్థానంలో ఉన్న అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య. ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (1627 ఫిబ్రవరి 19 - 1680 ఏప్రిల్ 3) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం, 1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.